• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అభినయ లవ్లీ స్పీచ్.....

అభినయ లవ్లీ స్పీచ్.. మాటలు రాకున్నా మనసుకు హత్తుకునేలా..

| మొదట ఆమె శంభో శివ శంభో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

By - Tupaki Desk
Update: 2024-03-01 06:15 GMT

అందమైన చిరునవ్వుతో చూడగానే ఎంతగానో ఆకర్షించే అభినయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు మాటలు రాకపోయినా కూడా తన హవ భావాలతోనే ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఆమె నటిగా ఒక వైపు తమిళ్ ఇండస్ట్రీలో మరొకవైపు తెలుగు ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోతుంది. మొదట ఆమె శంభో శివ శంభో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రముఖ హీరోల సినిమాలలోనే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలలో మంచి నిడివి ఉన్న పాత్రలలో నటిస్తోంది. ఇక తెలుగులో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా హీరోల చెల్లెలిగా కనిపించిన విషయం తెలిసిందే. చాలా సింపుల్ గా ఒక అచ్చమైన తెలుగు సాంప్రదాయ అమ్మాయిల కనిపిస్తుంది. అందుకే అభినయను తమ కథలో సెలెక్ట్ చేసుకోవాల్సిందే అనేలా ఆమె దర్శకులను అట్రాక్ట్ చేస్తుంది.

మంచి టైమింగ్ ఉన్న ఈ నటి రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇక గామి సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆమె తన భావాలను వ్యక్తపరిచిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఆమె సైన్ లాంగ్వేజ్ స్పీచ్ ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ట్రాన్స్ లేటర్ ద్వారా సినిమా గురించి అలాగే నటీనటుల గురించి కూడా చాలా చక్కగా వివరించింది. మొదట ఈ కథ విన్నప్పుడు చాలా గొప్పగా ఫీలయ్యాను అని ఇలాంటి మంచి కథలో అవకాశం కల్పించినందుకు దర్శకుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటునట్లు వివరణ ఇచ్చారు.

అంతేకాకుండా ఈ సినిమాలో ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు అని చాలా తెలివిగా కూడా వర్క్ చేశారని ఆమె చెప్పారు. హీరో విశ్వక్ సేన్ కూడా నటనతో బాగా ఆకట్టుకున్నాడు అని ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఇక ఈ వేడుకకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆయన గురించి కూడా మాట్లాడిన అభినయ ఆయన డైరెక్ట్ చేసిన యానిమల్ సినిమా తను చూశాను అని ఆ సినిమా తనకు చాలా బాగా నచ్చింది అని చెప్పింది. ఇక భవిష్యత్తులో కూడా సందీప్ గారు మరిన్ని మంచి ప్రాజెక్టులతో రావాలి అని తన హావభావాలతో వివరణ ఇవ్వగా ట్రాన్స్ లెటర్ చాలా చక్కగా ఆమె భావాలను మాటలతో బయటకు చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Abhinaya. Name correct gaa saripoindhi. No need of words.She won my ❤️ pic.twitter.com/mwvLYv2Yeh

— CHARAN (@CHARANMB09) March 1, 2024


Tags:    
  • Shambhoshivashambho 
  • Teluguindustry 
  • Tamilindustry 
  • Seethammavakitlosirimallechettu 
  • Abhinaya 
  • Gaami 
  • Vishweksen 
  • Sandeepreddyvanga 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS