కామెడీ ఫెస్టివ‌ల్‌లో గాళ్‌ఫ్రెండ్‌తో హీరో చిల్

మార్చి 13న తన 60వ పుట్టినరోజున, అమీర్ ఖాన్ తన గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను పరిచయం చేసిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-13 09:30 GMT

మార్చి 13న తన 60వ పుట్టినరోజున, అమీర్ ఖాన్ తన గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను పరిచయం చేసిన సంగ‌తి తెలిసిందే. రెండో భార్య కిర‌ణ్ రావు నుంచి దూర‌మయ్యాక ఒంట‌రిగా ఉన్న అమీర్ ఖాన్ త‌న కంపెనీలో ప‌ని చేస్తున్న మ్యారీడ్ యువ‌తిని ప్రేమించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌గా మారింది. ఒక బిడ్డ త‌ల్లి అయిన గౌరీ స్ప్రాట్ తో అత‌డి సాన్నిహిత్యం ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పుడు గౌరీ స్ప్రాట్ 1900 కోట్ల అధిప‌తికి స్నేహితురాలు.

గౌరీతో అత‌డు ఎంతో ప్రేమగా ఉన్నాడు. ఇటీవల ఈ జంట మకావు అంతర్జాతీయ కామెడీ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జంట‌ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫెస్టివల్‌లో అమిర్ ఖాన్ తన గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌తో స‌న్నిహితంగా క‌నిపించారు. ఆ ఇద్ద‌రూ సాంప్రదాయ దుస్తులలో ఎంతో అందంగా కనిపించారు. వైరల్ అవుతున్న ఫోటోలలో ఇద్దరూ వేదిక వద్ద ఉన్న కెమెరాల‌ను చూస్తూ స్మైలిచ్చారు. చైనీస్ నటులు షెన్ టెంగ్, మా లీ కూడా వారితో పాటు వేదిక‌పై క‌నిపించారు. ఒక ఫోటోలో అమీర్, గౌరీ, షెన్ టెంగ్, మా లీ న‌లుగురూ కలిసి పోజులిచ్చారు. ఆ స‌మ‌యంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అమీర్ నల్ల కుర్తా, తెలుపు పైజామా, నలుపు, బంగారు రంగు శాలువా ధరించగా, గౌరీ పూల చీర ధరించి ఉన్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలా మంది వారి బహిరంగ ప్రదర్శనను ప్ర‌శంసిస్తున్నారు.

అమీర్ ఖాన్ తన స్నేహితురాలు గౌరీని ఒక‌ మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో మీడియాకు పరిచయం చేశాడు. తన 60వ పుట్టినరోజు ప్రెస్ మీట్ సందర్భంగా ఈమె బెంగ‌ళూరుకు చెందిన అమ్మాయి అని, మేం ఒక‌రికొక‌రం 25 సంవత్సరాలుగా తెలుసు కానీ ఏడాదిన్నర క్రితం కనెక్ట్ అయ్యామ‌ని తెలిపారు. ``ఆమె ముంబైలో ఉంది. మేము అనుకోకుండా కలుసుకున్నాము. సన్నిహితంగా ఉన్నాము.. ఆపై అంతా సహజంగానే మొద‌లైంది`` అంటూ ఒక సినిమా క‌థ‌లా చెప్పారు ఖాన్ జీ.

అమీర్ ఖాన్‌కు 1986 - 2002 వరకు రీనాదత్తా స‌హ‌చ‌రి. ఆమెకు విడాకులిచ్చాక కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. మొదటి వివాహం నుండి జునైద్ - ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2005లో దర్శకురాలు కిరణ్‌ను వివాహం చేసుకున్నా కానీ వారు 2021లో విడిపోయారు. విడిపోయినా కానీ, తమ కుమారుడు ఆజాద్‌కు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News