టాలీవుడ్ విషయంలో ఆ ముగ్గురికి భిన్నంగా అమీర్ ఖాన్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రాంతీయ సరిహద్దులు వేగంగా చెరిగిపోతున్న తరుణంలో తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటుతోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రాంతీయ సరిహద్దులు వేగంగా చెరిగిపోతున్న తరుణంలో తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకులు టాలీవుడ్ సాధిస్తున్న విజయాలపై స్పందించే విధానం చిత్ర పరిశ్రమలోనూ.. ప్రేక్షకులలోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా హిందీ చిత్రసీమలోని నలుగురు అగ్ర నటులైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్‌లను గమనిస్తే... తెలుగు సినిమాల పట్ల, ఇక్కడి మార్కెట్ పట్ల ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేక శైలి. అయితే వీరందరిలోకి మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ టాలీవుడ్ విషయంలో చూపిస్తున్న చొరవ, స్పందన మిగిలిన వారికంటే పూర్తిగా భిన్నంగా ప్రశంసనీయంగా కనిపిస్తోంది.
అమీర్ ఖాన్ ఒక సినిమా విజయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభినందించడానికే పరిమితం కారు. తెలుగు చిత్ర పరిశ్రమతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. టాలీవుడ్ సాధిస్తున్న సాంకేతిక ప్రగతిని, ఇక్కడి కథల ఎంపికను ఆయన నిరంతరం నిశితంగా గమనిస్తూ ఉంటారు. గతంలో `ఆర్ఆర్ఆర్` వంటి చిత్రాల ప్రమోష న్లలో ఆయన స్వయంగా పాల్గొనడం చూసాం. తెలుగు దర్శకుల మేధస్సును బహిరంగంగా ప్రశంసించడం చూశాం. సినిమా కంటెంట్‌ను అమితంగా ప్రేమించే అమీర్ టాలీవుడ్ సృజనాత్మకతను మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. ఇక్కడి నటీనటులు ,దర్శకులతో ఇంటరాక్ట్ అవ్వడానికి మొదటి వరుసలో ఉంటారు.
తెలుగు సినిమా కథలలో ఉండే బలమైన ఎమోషన్స్, ప్రేక్షకాదరణ పొందే మూల సూత్రాలను ఆయన ఒక కేస్ స్టడీలా భావిస్తారు. దక్షిణాది చిత్రాల కథా బలం, ఇక్కడి మేకర్స్ చూపిస్తున్న అంకితభావమే భారతీయ సినిమాకు కొత్త దిశా నిర్దేశం చేస్తున్నాయని పలుమార్లు అభిప్రాయపడ్డారు. కేవలం ట్వీట్లకే పరిమితం కాకుండా.. టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం అవ్వడం.. ఇక్కడి సినిమా ఈవెంట్లకు హాజరవడం ద్వారా అమీర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
అమీర్ ఖాన్ తర్వాత టాలీవుడ్‌తో మంచి సంబంధాలు కలిగి ఉన్న హీరోలుగా సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ నిలుస్తారు. సల్మాన్ ఖాన్‌కు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో ఉన్న దశాబ్దాల వ్యక్తిగత అనుబంధం కారణంగా `గాడ్ ఫాదర్` చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కూడా కనిపించారు. తెలుగు సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెంట్లు, హై-వోల్టేజ్ యాక్షన్‌ను సల్మాన్ ఎంతగానో ఇష్టపడతారు. మరోవైపు హృతిక్ రోషన్ సైతం టాలీవుడ్ విజువల్ గ్రాండ్యూర్, భారీ యాక్షన్ కొరియోగ్రఫీని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేస్తుంటారు.
అయినా వీరిద్దరి స్పందనలు ఎక్కువగా వ్యక్తిగత స్నేహాలు..కొన్ని భారీ కమర్షియల్ చిత్రాలకే పరిమితమ వుతుంటాయి. దీనికి భిన్నంగా బాద్‌షా షారుక్ ఖాన్ వైఖరి టాలీవుడ్ విషయంలో చాలా అరుదుగా ఉంటుంది. షారుక్ ఖాన్ దక్షిణాది దర్శకుడైన అట్లీతో `జవాన్` లాంటి రికార్డులను తిరగరాసిన బ్లాక్‌బస్టర్ సాధిం చినప్పటికీ సాధారణంగా టాలీవుడ్ చిత్రాల గురించి .. ఇక్కడి పరిశ్రమ సాధిస్తున్న విజయాల గురించి బహిరంగ వేదికలపై మాట్లాడటం చాలా తక్కువ. ఆయన తన సొంత చిత్రాల అంతర్జాతీయ మార్కెట్ ..ప్రమోషన్లలో బిజీగా ఉండటం కారణం కావచ్చు? ఏదేమైనా? టాలీవుడ్ కంటెంట్‌పై .. ఇక్కడి స్టార్ల చిత్రాలపై నేరుగా స్పందించే సందర్భాలు షారుక్ కెరీర్‌లో చాలా అరుదుగా కనిపిస్తాయనేది వాస్తవం.