టాలీవుడ్ నిర్మాతలు అమీర్ ఖాన్ లా చేయగలరా?
కానీ ఎవరూ ఓటీటీని ప్రశ్నించే ధైర్యం మాత్రం చేయడం లేదు. ఓటీటీ ఇచ్చిన డేట్ల ప్రకారం సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది.;
ఓటీటీ కోరలు పీకేలా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సరికొత్త నిర్ణయంతో కదిలిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన `సితారే జమీన్ ఫర్` చిత్రాన్ని ఎలాంటి ఓటీటీ సంస్థకు విక్రయించకుండా ముందు గా థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అనంతరం అదే చిత్రాన్ని నేరుగా పేపర్ వ్యూ ద్వారా యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ ఎంతో నిజాయితీగా చేస్తోన్న ప్రయత్నమిది.
ఓటీటీ కారణంగా సినిమాకు జరుగుతోన్న నష్టాన్ని అంచనా వేసి తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ఈ కారణంగా అమీర్ ఖాన్ కొంత నష్టపోతున్నాడు. ప్రేక్షకులు సినిమాను కేవలం థియేటర్లో మాత్రమే చూడలని సంకల్పించి చేస్తోన్న ప్రయత్నిమిది. ఇప్పటికే థియేటర్ కు ప్రేక్షకులు రావడం లేదు. అందుకు కారణం ఓటీటీ అని అందిరకీ తెలుసు. కానీ వ్యాపార దృక్కోణంలో ఆ విషయాన్ని విస్మరించి సినిమాను కిల్ చేస్తున్నారు? అన్న ఆరోపణ అన్ని చిత్ర పరిశ్రమల నిర్మాతలపైనా ఉంది.
మిగతా ఇండస్ట్రీల సంగతి పక్కనబెడితే అమీర్ ఖాన్ లా టాలీవుడ్ నిర్మాతలు కూడా పేపర్ వ్యూ ద్వారా సినిమాను రిలీజ్ చేయగలరా? అంత దమ్ము ధైర్యం తెలుగు నిర్మాతలకు ఉందా? అని పరీక్షించు కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే తమ సినిమాని ఓటీటీ నిర్దేశిస్తుందని చాలా మంది నిర్మా తలు లబోదిబో మంటున్నారు. తాము తీసిన సినిమా రిలీజ్ పై తమకే హక్కులు లేకుండా పోతున్నా యనే అంశం నిరంతరం చర్చకొస్తూనే ఉంది.
కానీ ఎవరూ ఓటీటీని ప్రశ్నించే ధైర్యం మాత్రం చేయడం లేదు. ఓటీటీ ఇచ్చిన డేట్ల ప్రకారం సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అటుపై ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ కూడా ఇక్కడ నిబంధనలు మీరుతుంది. చిన్న సినిమాకి ఒకలా...పెద్ద సినిమాకు మరోలా ట్రీట్ మెంట్ అందిస్తుంది. సినిమా హిట్ అయితే ఎనిమిది వారాల తర్వాత కాకపోతే థియేటర్ రిలీజ్ అనంతరం వారం కూడా గడవకముందే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
ఆ కారణంగా చిన్న సినిమాని ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లి చూసే పరిస్థితి ఉండటం లేదు. ఈ ప్రోసస్ లో నిర్మాత నష్టపోవడం లేదు కానీ స్వేచ్ఛని కోల్పోతున్నాడు. రిలీజ్ పై హక్కును కోల్పోతున్నాడు. ప్రేక్షకుల కు సినిమా థియేటర్ దూరమ వుతుంది. అందుకే అమీర్ ఖాన్ కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. అమీర్ ఖాన్ లా నిర్మాతలంతా చేయగల్గితే థియేటర్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది. ఈ క్రమంలో నిర్మాత కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.