కేరళలో బన్నీ ఫ్యాన్స్ మీటింగ్ సక్సెస్.. ఇప్పుడు నార్త్ పై ఫోకస్..
కేరళలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల పవర్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.;
కేరళలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల పవర్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆయన సినిమాలకు మలయాళ ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ కారణంగా, అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ యాక్టివిటీస్ ఫుల్ జోష్ లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజధాని తిరువనంతపురం (త్రివేండ్రం)లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.
కేరళ రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగిన ఆ సమావేశంలో అసోసియేషన్ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. అభిమానులను మరింత కోపరేషన్ తో ముందుకు తీసుకెళ్లడం, అసోసియేషన్ ను స్ట్రాంగ్ గా మార్చడం, ప్రతి జిల్లాలో యాక్టివిటీస్ చురుకుగా నిర్వహించడం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఫ్యాన్స్ మధ్య యూనిటీ పెంచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సభ్యులు సూచించారు.
రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఆ సమావేశంలో, ఫ్యాన్స్ అసోసియేషన్ ను మరింత విస్తరించే దిశగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ప్రతి జిల్లాలో కమిటీలను బలోపేతం చేయడం, కొత్త సభ్యులను చేర్చుకోవడం, యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండడం, అప్ కమింగ్ జనరేషన్ ను చేరువ కావడం కూడా ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.
అల్లు అర్జున్ సినిమాలు కేరళలో విడుదలయ్యే ప్రతిసారి అభిమానులు భారీ స్థాయిలో రెస్పాండ్ అవ్వడం తెలిసిందే. సినిమా విడుదల సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాల్లో ఫ్యాన్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా AAFA వేగంగా విస్తరిస్తోందని నిర్వాహకులు వెల్లడించారు.
ఇప్పటికే సౌత్ స్టేట్స్ లో సక్సెస్ ఫుల్ గా సమావేశాలు నిర్వహించిన ఆ అసోసియేషన్, ఇప్పుడు నార్త్ ఇండియాలో తన యాక్టివిటీస్ ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. అన్ని ప్రాంతాల్లో అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడం, ఒక ఆర్గనైజ్డ్ అసోసియేషన్ గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అదేవిధంగా, జూన్ 4వ తేదీన సౌత్ ఇండియా స్థాయిలో గ్రాండ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ సమావేశానికి పలు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
ఆ గ్రాండ్ మీటింగ్ ద్వారా అన్ని రాష్ట్రాల ఫ్యాన్స్ మధ్య కోపరేషన్, ఎక్స్పీరియన్స్ షేరింగ్, ఫ్యూచర్ ప్లాన్ పై చర్చ జరగనుంది. ఆ కార్యక్రమం ముగింపులో సభ్యులు ఉత్సాహంగా పాల్గొని, అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం మీద త్రివేండ్రంలో జరిగిన సమావేశం కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ బలోపేతానికి కీలక మైల్ స్టోన్ గా నిలిచింది. ఫ్యూచర్ లో మరింత విస్తరణకు మీటింగ్ ఫౌండేషన్ వేస్తుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు.