• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిన్న కథతో ప్రీమియర్స్...

చిన్న కథతో ప్రీమియర్స్ డేర్

| ఈ మధ్యకాలంలో రిలీజ్ కి ముందు సినిమాలకి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-09-01 15:19 GMT

ఈ మధ్యకాలంలో రిలీజ్ కి ముందు సినిమాలకి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. సినిమా కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉన్న వారు ఇలా పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా డేర్ తో రిలీజ్ అయిన సినిమాలకి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ పెయిడ్ ప్రీమియర్స్ కారణంగా పబ్లిక్ లోకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ముందుగానే వెళ్లడం వలన సినిమాకి అదనపు అడ్వాంటేజ్ అవుతోంది. కంటెంట్ ఉన్న చిత్రాలకి ఇలాంటి పెయిడ్ ప్రీమియర్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.

గతంలో మేజర్, చార్లీ777, హనుమాన్ సినిమాలకి స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. అయితే మిస్టర్ బచ్చన్ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ వేసిన అది వర్క్ అవుట్ కాలేదు. కంటెంట్ బాగుంటే సినిమాకి ఆటోమేటిక్ గా ఆదరణ వస్తుంది. అయితే పోటీలో ఎక్కువ సినిమాలు ఉన్నప్పుడు ఈ పెయిడ్ ప్రీమియర్ షోలు కచ్చితంగా పబ్లిక్ లోకి మౌత్ టాక్ ని పంపించడానికి ఉపయోగపడుతుంది.

ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన చిన్న సినిమా 35 చిన్న కథ కాదు చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని డిసైడ్ అయ్యారంట. సెప్టెంబర్ 4, 5 తేదీలలో ఎంపిక చేసిన థియేటర్స్ లలో ఈ పెయిడ్ ప్రీమియర్స్ ఈ సినిమాకి వేయబోతున్నారంట. కచ్చితంగా ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కంటెంట్ బేస్డ్ కథలతో తెరకెక్కే చిన్న సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

ఆగష్టులో కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. వాటి తరహాలోనే 35 చిన్న కథ కాదు కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. నివేదా థామస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ట్రైలర్ కి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే పెయిడ్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

దీనికి ఒక రోజు ముందు ఇళయదళపతి విజయ్ GOAT చిత్రం థియేటర్స్ లోకి రానుంది. సెప్టెంబర్ 7న రాజ్ తరుణ్ భలే ఉన్నాడే, సుహాస్ జనక అయితే గనక సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ పోటీని తట్టుకొని బడ్జెట్ పరంగా చిన్న చిత్రంగా వస్తోన్న '35 చిన్న కథ కాదు' ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి.

Tags:    
  • 35chinnakathakaadu 
  • Nivethathomas 
  • Viswadevr 
  • Priyadarshi 
  • Nandakishore 
  • Ranadaggubati 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS