2026 బాక్సాఫీస్.. నెంబర్లు పెద్దవే, కానీ లాభాలు మాత్రం లేవు
2026 తెలుగు బాక్సాఫీస్ లిస్ట్ చూస్తే మొదటి మూడు స్థానాల్లో భారీ నంబర్లే ఉన్నాయి.
2026 తెలుగు బాక్సాఫీస్ లిస్ట్ చూస్తే మొదటి మూడు స్థానాల్లో భారీ నంబర్లే ఉన్నాయి. ఫస్ట్ ‘పెద్ది’ రూ.340 కోట్లతో ఉండగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ రూ.301 కోట్లతో రెండో స్థానంలో, ‘ది రాజాసాబ్’ రూ.206 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. కానీ ఈ మూడు సినిమాల ట్రేడ్ రిజల్ట్ ఒకేలా లేదు.
‘పెద్ది’కి ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.220 కోట్ల రేంజ్‌లో జరిగింది. ఆ స్థాయిలో హక్కులు అమ్మడంతో రూ.340 కోట్ల గ్రాస్ వచ్చినా సినిమా భారీ లాభాలు ఇచ్చిన హిట్‌గా మారలేదు. కొన్ని ట్రేడ్ ట్రాకర్స్ దీన్ని యావరేజ్ రేంజ్‌లోనే పెట్టాయి. కానీ రామ్ చరణ్ నటుడిగా చాలా కష్టపడ్డాడు అని మంచి ప్రశంసలు దక్కాయి.
దీనికి పూర్తి రివర్స్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలిచింది. వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.120 కోట్ల దగ్గర ఉండగా, ఫుల్ రన్‌లో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. బిజినెస్‌కు తగ్గ షేర్ రావడంతో సినిమా బయ్యర్లకు మంచి రిటర్న్స్ ఇచ్చింది. టాప్ 3లో నిజంగా లాభాల లెక్కలో బలంగా నిలిచిన సినిమా ఇదే. అలాగే రీజినల్ లాంగ్వేజ్ లలో టాప్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఇదొకటి.
‘ది రాజాసాబ్’ దగ్గర గ్యాప్ ఇంకా పెద్దది. అన్ని భాషలు కలిపి దాదాపు రూ.250 కోట్ల రేంజ్‌లో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు రిలీజ్ ముందు రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఫుల్ రన్ గ్రాస్ రూ.206 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అంటే హయ్యెస్ట్ గ్రాసర్స్‌లో మూడో స్థానంలో ఉన్నా, పెట్టిన టార్గెట్‌కు చాలా దూరంగా నిలిచింది. అందుకే కలెక్షన్ ర్యాంక్ ఒకటి, ట్రేడ్ రిజల్ట్ మరోటి.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఇప్పటి టాప్ 10:
1. పెద్ది: రూ.340 కోట్లు
2. మన శంకర వరప్రసాద్ గారు: రూ.301 కోట్లు
3.ది రాజాసాబ్: రూ.206 కోట్లు
4. ఇరుముడి: రూ.136.7 కోట్లు, ఇంకా రన్‌లో ఉంది
5. మా ఇంటి బంగారం: రూ.96 కోట్లు
6. ఉస్తాద్ భగత్ సింగ్: రూ.95 కోట్లు
7. అనగనగా ఒక రాజు: రూ.80 కోట్లు
8. లెనిన్: రూ.69 కోట్లు
9. డెకాయిట్: రూ.55 కోట్లు
10. చెన్నై లవ్ స్టోరీ: రూ.51 కోట్లు
ఇప్పుడు ఈ లిస్ట్‌లో అందుకునే చాన్స్ ‘ది ప్యారడైజ్’కు ఉంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ వాల్యుయేషన్ రూ.100 కోట్ల మార్క్ దాటింది. నానికి ఇది కొత్త రేంజ్. కాబట్టి సెప్టెంబర్ 24న ఓపెనింగ్స్ తోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అలాగే ఇదే ఏడాది మరికొందరు స్టార్స్ కూడా నెక్స్ట్ సినిమాలతో రెడీ అవుతున్నారు. ఇక వాళ్ళ లెక్క ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.