2025:టాలీవుడ్ హీరోయిన్ల‌కు స‌ర్వైవ‌ల్ ఇయ‌ర్‌!

2025 మ‌రో మూడు రోజుల్లో ముగియ‌నుండ‌గా కొత్త ఏడాదికి స్వాగ‌తం ప‌ల‌క‌బోతున్నారు. కొత్త ఆశ‌ల‌తో స‌రికొత్త విజ‌యాల‌తో కొత్త ఏడాదికి స్వాగ‌తంప‌ల‌క‌బోతున్నారు.;

Update: 2025-12-30 03:30 GMT

2025 మ‌రో మూడు రోజుల్లో ముగియ‌నుండ‌గా కొత్త ఏడాదికి స్వాగ‌తం ప‌ల‌క‌బోతున్నారు. కొత్త ఆశ‌ల‌తో స‌రికొత్త విజ‌యాల‌తో కొత్త ఏడాదికి స్వాగ‌తంప‌ల‌క‌బోతున్నారు. 2025లో స్టార్ హీరోల సినిమాలు సంద‌డి చేయ‌క‌పోయినా ప‌రోక్షంగా బాక్సాఫీస్ వ‌ద్ద స్టార్ హీరోల డామినేష‌న్ ఉన్నా కానీ కంటెంట్ ఉన్న క్యారెక్ట‌ర్ల‌తో హీరోయిన్‌లు మాత్రం త‌మ‌దైన మార్కు న‌ట‌న‌తో , పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారు. కొంత మంది వంద ఓట్ల క్ల‌బ్‌లో నిలిస్తే ర‌ష్ఇమ‌క మంద‌న్న లాంటి హీరోచ‌యిన్ ఎనిమిది వంద‌ల కోట్ల క్ల‌బ్‌లో చేరి టాప్‌లో నిలిచింది.

ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి `తండేల్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీలో డీ గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్‌లో బుజ్జిత‌ల్లిగా న‌టించి ఆక‌ట్టుకుంది. నాగ‌చైత‌న్య హీరోగా చెందూ మొండేటి డైరెక్ష‌న్‌లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.100 కోట్ల మార్కుని చేరింది. గ్లామ‌ర్ లేకుండా అత్యుత్త‌మ‌మైన పెర్ఫార్మెన్స్‌తో సాయి ప‌ల్ల‌వి ది బెస్ట్ అనిపించుకుంది.

ర‌ష్మిక మంద‌న్న ఈ ఏడాది వ‌రుస క్రేజీ సినిమాల‌తో టాప్‌లో నిలిచింది. విక్కీ కౌశ‌ల్‌తో చేసిన బాలీవుడ్ మూవీ `ఛావా` బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సాధించి రూ.800 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా ర‌ష్మిక స‌రికొత్త ఫీట్‌ని సాధించి ఔరా అనిపించింది. ఈ మూవీ త‌రువాత చేసిన `కుబేర‌`, థామా చిత్రాలు కూడా వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం, రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ష‌న్‌లో చేసిన `ది గాళ్ ఫ్రెండ్‌` పెర్ఫార్మెన్స్ ప‌రంగా మంచి పేరు తెచ్చి పెట్ట‌డంతో 2025లో ర‌ష్మిక హీరోయిన్‌గా వెర్స‌టైల్ రోల్స్‌తో టాప్‌లో నిలిచింది.

ఈ ఏడాది తెలుగు తెర‌కు కొత్త భామ‌లు హీరోయిన్‌లుగా ప‌రిచ‌యం అయ్యారు. కొత్త వాళ్ల‌లో శ్రీ‌దేవి అప్ప‌ల‌, తేజ‌స్వీ రావు త‌మ స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఇంప్రెస్ చేశారు. శ్రీ‌దేవి అప్ప‌ల `ది కోర్ట్‌` మూవీతో ప‌రిచ‌యం అయింది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి శ్రీ‌దేవికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఇదే త‌ర‌హాలో `రాజు వెడ్స్ రాంబాయి`లో న‌టించిన తేజ‌స్వీ రావు కూడా ఆక‌ట్టుకుంది.

న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి మంచి పేరు తెచ్చుకుంది. తెలంగాణ యాస‌తో సాగే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి ఎమోష‌న్స్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లో భాగం అయింది. ఇక లిటిల్ హార్ట్స్ మూవీలో న‌టించిన శివాని నాగారం ఇంపాక్ట్ ఉన్న క్యారెక్ట్‌తో శ‌భాష్ అనిపించింది. ఇక తేజ స‌జ్జ‌తో క‌లిసి న‌టించిన `మిరాయ్‌`తో పాన్ ఇండియా క్రేజ్‌ని ద‌క్కించుకుంది. `అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం`తో ఎంట్రీ ఇచ్చినా `మిరాయ్‌`తో మాత్ర‌మే గుర్తింపుని ద‌క్కించుకుంది. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ న‌టించిన `డ్యూడ్‌` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించి కంటెంట్ డ్రైవెన్ సినిమాతో పేరు తెచ్చుకుంది. ఈ హీరోయిన్‌ల స‌క్సెస్‌ల‌తో స్క్రిప్ట్ బాగుంటేనే కెరీర్ లాంగ్ ర‌న్ ఉంటుంద‌ని, అంతే కాకుండా ఈ ఏడాది అలాంటి సినిమాల‌తో హీరోయిన్‌ల‌కు బాగా క‌లిసి వ‌చ్చింద‌ని నిరూపించింది.

Tags:    

Similar News