పికిల్ బాల్ కోర్ట్ లో యాషిక రచ్చ.. స్పోర్టీ లుక్ లో గ్లామర్ హీట్!

సోషల్ మీడియాలో గ్లామర్ విందుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నటి యాషిక ఆనంద్. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, వెండితెరపై కంటే ఇన్ స్టాగ్రామ్ లోనే ఎక్కువ సందడి చేస్తుంటుంది.;

Update: 2025-12-30 03:45 GMT

సోషల్ మీడియాలో గ్లామర్ విందుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నటి యాషిక ఆనంద్. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, వెండితెరపై కంటే ఇన్ స్టాగ్రామ్ లోనే ఎక్కువ సందడి చేస్తుంటుంది. ఎప్పుడూ ఘాటైన ఫొటోషూట్స్ తో కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేసే యాషిక, ఈసారి రూటు మార్చి స్పోర్ట్స్ వేర్ లో దర్శనమిచ్చింది. తాజాగా ఆమె షేర్ చేసిన పికిల్ బాల్ కోర్ట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

ఈ లేటెస్ట్ పిక్స్ లో యాషిక వైట్ కలర్ క్రాప్ టాప్, దానికి మ్యాచింగ్ గా మినీ స్కర్ట్ ధరించి అదిరిపోయే లుక్ లో కనిపిస్తోంది. తలపై వైట్ క్యాప్, కాళ్లకు వైట్ సాక్స్, షూస్ వేసుకుని పర్ఫెక్ట్ స్పోర్టీ గర్ల్ లా తయారైంది. అయితే ఈ లుక్ లో ఆమె స్పోర్ట్స్ ఆడటం కంటే, తన గ్లామర్ ను ప్రదర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపినట్లు అనిపిస్తోంది.

కోర్ట్ లో ఉన్న నెట్ పక్కన, చేతిలో రాకెట్ పట్టుకుని ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తుంటే ఎవరైనా క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే. ముఖ్యంగా కోర్ట్ లోపల కింద పడుకుని, చుట్టూ బంతులు వేసుకుని ఆమె ఇచ్చిన స్టిల్స్ చాలా కవ్వించేలా ఉన్నాయి. ఆ టైట్ ఫిట్ డ్రెస్ లో ఆమె ఫిట్ నెస్ స్టిల్స్ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్లు జిమ్ వేర్ లో కనిపిస్తుంటారు, కానీ యాషిక ఇలా పికిల్ బాల్ కోర్ట్ ను కూడా గ్లామర్ అడ్డాగా మార్చేయడం విశేషం.

ఆట మాట ఎలా ఉన్నా, ఆమె గ్లామర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. పింక్ కలర్ రిస్ట్ బ్యాండ్, లూజ్ హెయిర్ తో ఆమె స్టైలింగ్ కూడా చాలా ట్రెండీగా ఉంది. సినిమాల విషయానికి వస్తే, యాషిక ప్రస్తుతం కోలీవుడ్ లో పలు చిన్న చిత్రాల్లో నటిస్తోంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీ, ఇలాంటి క్రేజీ ఫొటోషూట్స్ తో మేకర్స్ దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఏది ఏమైనా ఈ స్పోర్టీ లుక్ తో యాషిక సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.



Tags:    

Similar News