• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఛాన్స్ ఇచ్చారు.. సత్తా...

ఛాన్స్ ఇచ్చారు.. సత్తా చాటారు..!

| 2023 లో డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే సత్తా చాటిన వారు ఉన్నారు. బలగం వేణు నుంచి రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న శౌర్యువ్ వరకు తొలి సినిమాతోనే డైరెక్టర్ గా వారి సత్తా చాటి అదుర్స్ అనిపించారు.

By - Tupaki Desk
Update: 2023-12-30 16:30 GMT

సినీ పరిశ్రమ ఎప్పటికీ కొత్త వారిని ఎంకరేజ్ చేస్తుంది. అయితే తొలి సినిమాతో సక్సెస్ అందుకున్న ఆ డైరెక్టర్ వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉంటుంది. దశాబ్ధ కాలంగా పరిశ్రమలో ఉంటూ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే దర్శకులు చాలామంది ఉంటారు. వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్నది కొంతమంది ఆలోచన అయితే.. కొత్త వాళ్లతో రిస్క్ ఎందుకు అనుకున్న వారు కొంతమంది. 2023 లో డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే సత్తా చాటిన వారు ఉన్నారు. బలగం వేణు నుంచి రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న శౌర్యువ్ వరకు తొలి సినిమాతోనే డైరెక్టర్ గా వారి సత్తా చాటి అదుర్స్ అనిపించారు.

2023 కొత్త దర్శకులు తమ ప్రతిభ కనబరిచారని చెప్పొచ్చు. ఈ ఇయర్ సెన్సేషనల్ హిట్ లో ఒకటైన బలగం సినిమాను నటుడు వేణు డైరెక్ట్ చేశారు. మొన్నటిదాకా కమెడియన్ గా జబర్దస్త్ షో లో కూడా మెప్పించిన వేణు తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని బలగం సినిమా చేశాడు. తెలంగాణ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో బలగం సినిమా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

ఈ ఇయర్ మొదట్లోనే రైటర్ పద్మభూషణ్ సినిమాతో తొలి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు షణ్ముఖ్ ప్రశాంత్. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఇయర్ సంచలన విజయాల్లో ఒకటి దసరా. న్యాచురల్ స్టార్ నాని హీరోగా డిబటెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దసరా. శ్రీకాంత్ మీద నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

ఈ ఇయర్ సుమంత్ ప్రభాస్ కూడా తన డైరెక్షన్ లో తీసిన మేమ్ ఫేమస్ తో హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ గా తొలి సినిమా అవ్వడమే కాదు హీరోగా కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాడు. ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ కూడా తన సత్తా చాటాడు. ఇక మ్యాడ్ సినిమాతో ఈ ఇయర్ యూత్ ఫుల్ హిట్ అందుకున్నాడు కళ్యాణ్ శంకర్. యువత మెచ్చేలా సినిమా తీసి మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ అనిపించాడు కళ్యాణ్ శంకర్.

ఈ నెల రిలీజైన హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు నాని. ఆల్రెడీ దసరా తో శ్రీకాంత్ కి తొలి అవకాశం ఇచ్చిన నాని హాయ్ నాన్నతో శౌర్యువ్ సత్తా చాటాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు మరో సెన్సిబుల్ డైరెక్టర్ దొరికాడని ఫిక్స్ అయ్యారు.

తొలి సినిమా అవకాశం అందుకోవడమే కాదు వచ్చిన ఛాన్స్ ని సద్వినియోగ పరచుకుని సత్తా చాటిన దర్శకులుగా సూపర్ అనిపించారు. వీరు తీసే నెక్స్ట్ సినిమాకు కూడా భారీ అంచనాలు ఏర్పడేలా చేసుకున్నారు.

Tags:    
  • Tollywood 
  • Venu 
  • Director 
  • Sumanthprabhas 
  • Srikanthodela 
  • Shouryuv 
  • Shanmukhprashant 
  • Youngdirector 
  • Blockbuster 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS