నేనొక్కడినే.. అర్ధమైందా లేదా ఇదొక్కటే డిస్కషన్..!

మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 1 నేనొక్కడినే. అప్పటికే దూకుడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన 14 రీల్స్ లో చేసిన సినిమా అది.;

Update: 2025-12-01 06:52 GMT

మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 1 నేనొక్కడినే. అప్పటికే దూకుడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన 14 రీల్స్ లో చేసిన సినిమా అది. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేయడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఐతే ఈ సినిమా చూసిన ఆడియన్స్ చాలా కన్ ఫ్యూజ్ అయ్యారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అలా ఉంది కాబట్టే సినిమా జనాలకు ఎక్కలేదు. ఐతే ఇదే విషయాన్ని ఆఫ్టర్ లాంగ్ టైం నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట వెల్లడించారు.

బాగుందా బాగాలేదా.. అర్థమైందా కాలేదా డిస్కస్..

1 నేనొక్కడినే సినిమా విషయంలో బాగుందా బాగాలేదా అన్న దానికన్నా అందరు అర్థమైందా కాలేదా అన్నట్టుగా డిస్కస్ చేశారని అన్నారు. ఆ సినిమా విషయంలో ఆడియన్స్ కి స్టోరీ గురించి హింట్ ఇవ్వాలి.. వాళ్లు జేమ్స్ బాండ్, బోర్న్ సీరీస్ అనుకునేలా చేస్తే ఇప్పుడు కూడా కష్టమే అని అన్నారు నిర్మాత రామ్ ఆచంట.

1 సినిమాలో మహేష్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ అయితే ఆల్ టైం ఫేవరెట్ అనేశారు. అఫ్కోర్స్ మిగతా సినిమాల్లోని పాత్రలు బాగున్నా 1 ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని అనుకున్నారు. కానీ ఆ సినిమా రిజక్ట్ మహేష్ ని డిజప్పాయింట్ చేసింది. కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చితే సరిపోదు కదా ఆడియన్స్ కి నచ్చాలి. సుకుమార్ కన్ ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే సినిమాను ఆడియన్స్ కి కూడా కన్ ఫ్యూజ్ చేసింది.

కన్ ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా..

హీరోకి ఉన్న సైకలాజికల్ ఇష్యూని ఇంకాస్త ముందే రివీల్ చేస్తేనో.. లేదా క్లారిటీగా కొన్ని సీన్స్ చూపిస్తేనో కాస్త బాగుండేది. ఐతే సుకుమార్ ఆడియన్స్ చాలా తెలివైన వారని అనుకుని అలా కన్ ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా తీశాడు. కానీ అది జనాలకు ఎక్కలేదు. అందుకే 1 నేనొక్కడినే గురించి నిర్మాతలు చెప్పినట్టుగా బాగుందా బాగాలేదా అన్న పాయింట్ కన్నా అర్ధం అయ్యిందా లేదా అన్న డిస్కషన్ జరిగేది.

ఐతే ఆ షాక్ తో నిర్మాతలు ఆడియన్స్ కి ముందే కథ, హీరో క్యారెక్టర్ పై ఒక క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. 1 మాత్రమే కాదు లై సినిమా టైంలో కూడా వాళ్ల అమ్మ గారే మీరు అర్ధమయ్యే సినిమాలు చేయరా అన్నట్టు చెప్పారని అన్నారు రాం ఆచంట. సో లై, 1 నేనొక్కడినే లాంటి సినిమాలు అర్ధం కాకపోవడం వల్లే ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 1 విషయంలో మహేష్ చాలా కష్టపడ్డాడు కానీ రిజల్ట్ మాత్రం సూపర్ స్టార్ కి షాక్ ఇచ్చింది.

Tags:    

Similar News