• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Kerala >  బాత్‌రూమ్‌లో మొదలైన...

బాత్‌రూమ్‌లో మొదలైన ప్రయాణం.. 17 ఏళ్లకే పుతిన్‌తో సెల్ఫీ.. రౌల్ జాన్ అజు స్ఫూర్తిదాయక గాథ

| కేరళకు చెందిన 17 ఏళ్ల రౌల్ జాన్ అజు చిన్న వయసులోనే ఏఐ స్టార్టప్ స్థాపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 15 మంది ఉద్యోగులతో సంస్థను నడుపుతూ, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఏఐ శిక్షణ అందిస్తున్నాడు. తన కంపెనీలో తండ్రికే నెలకు రూ.2 లక్షల జీతంతో ఉద్యోగం ఇవ్వడం విశేషం. మాస్కోలో పుతిన్‌ను కలవడంతో రౌల్ పేరు మరింతగా చర్చలోకి వచ్చింది.

By - A.N.Kumar
Update: 2026-11-28 15:30 GMT

ఒకప్పుడు పిల్లలు తమ అవసరాల కోసం తల్లిదండ్రులపై ఆధారపడేవారు.. చదువు ముగిశాక ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకునేవారు. కానీ నేటి సాంకేతిక యుగంలో యువత ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కేరళలోని కొచ్చికి చెందిన కేవలం 17 ఏళ్ల టీనేజర్ రౌల్ జాన్ అజు సొంతంగా స్టార్టప్ స్థాపించి.. తన తండ్రికే నెలకు రూ.2 లక్షల జీతం ఇచ్చే స్థాయికి ఎదిగి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

రౌల్ ప్రయాణం తొమ్మిదేళ్ల వయసులో బాత్‌రూమ్‌లో రూపొందించిన చిన్న వీడియోతో మొదలైంది. అప్పట్లో ఏదో కొత్తగా నేర్చుకోవాలనే ఉత్సాహం మాత్రమే ఉన్నా.. అదే ఆసక్తి అతడిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు నడిపించింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే తండ్రి ప్రభావంతో చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై మక్కువ పెంచుకున్న రౌల్.. పన్నెండేళ్లకే స్కూల్ ప్రాజెక్ట్ కోసం మిబాట్ అనే రోబోట్‌ను రూపొందించాడు. ఇప్పటివరకు 15 ఏఐ ఆధారిత టూల్స్ అభివృద్ధి చేసి నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాడు.

ప్రస్తుతం 12వ తరగతి కామర్స్ చదువుతున్న రౌల్.. 'ఏఐ రియల్మ్ టెక్నాలజీస్' పేరుతో సంస్థను నెలకొల్పాడు. ఈ బృందంలో 15 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా థింక్‌క్రాఫ్ట్ అకాడమీ ద్వారా ఐఐటీలు, ఐఐఎంలు, విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా విద్యార్థులకు ఏఐ శిక్షణ అందిస్తున్నారు. చిన్ననాడు తనకు టెక్నాలజీ ప్రపంచాన్ని పరిచయం చేసిన తండ్రికే ఇప్పుడు తన కంపెనీలో నెలకు రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగం ఇవ్వడం విశేషంగా నిలిచింది.

మాస్కోలో జరిగిన ఏఐ జర్నీ 2026 సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తో నేరుగా మీటింగ్ లో పాల్గొని సంభాషించి అనంతరం పుతిన్ తో రౌల్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుతిన్‌ను కలిసిన అతి పిన్న వయస్కుల్లో రౌల్ ఒకరిగా నిలవడం.. తొమ్మిదేళ్ల చిన్న వీడియో స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికపై నిలిచే వరకు సాగిన అతడి ప్రయాణం నేటి తరానికి గొప్ప స్ఫూర్తినిస్తోంది. ఆసక్తి, నేర్చుకునే తపన ఉంటే చిన్న వయసులోనే ఆవిష్కరణలు చేయవచ్చని రౌల్ నిరూపించాడు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా టెక్నాలజీని సమస్యల పరిష్కారానికి వాడటం కీలకమని నిరూపించాడు. వేగంగా మారుతున్న ఏఐ రంగంలో భయపడకుండా కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం అత్యవసరమని ఈ కాలం యువతకు చాటి చెప్పాడు.. రౌల్ ప్రయాణం నిజంగా నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా చెప్పొచ్చు.

Tags:    
  • rahuljohnaju 
  • keralaentrepreneur 
  • teenentrepreneur 
  • aistartup 
  • artificialintelligence 

Similar News

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు!

2026-11-27 05:21 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!

2026-11-12 18:17 GMT

దీపావళికి ఉద్యోగినులకు ఐఫోన్లు.. కేరళకు చెందిన బిజినెస్ ఉమెన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్!

2026-11-07 02:10 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

గవర్నర్ వెజిటేరియన్.. రాజ్ భవన్ లో శాఖహారం.. కేరళలో ముదిరిన వివాదం

2026-10-25 11:36 GMT

నో ప్రాబ్లమ్.. మా నాన్న చూసుకుంటాడు.. యాక్సిడెంట్ చేసి ముగ్గురిని చంపి బలుపు మాటలు

2026-10-12 10:24 GMT

ఆమె రాజీనామా....బీజేపీ మేయర్ పీఠానికి షాక్

2026-10-04 19:04 GMT

రాజ‌కీయ సుడిలో 'స్వామి ప్ర‌సాదం'

2026-09-22 02:30 GMT

జపాన్ లో సెంచరీ...డెడ్ ఈజీ టాస్క్ !

2026-09-17 03:45 GMT

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్..? త్వరలో కీలక మార్పులు

2026-09-11 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS