• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Kerala >  నా ఫోన్ ట్యాప్...

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు!

| తన ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేస్తున్నారని కేరళ సీఎం వి.డి. సతీశన్ అన్నారు. తన సంభాషణలు వింటున్నవారిని తప్పుదారి పట్టించేందుకు ఫోన్‌లో అప్పుడప్పుడు కావాలనే అబద్ధాలు చెబుతానని వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఏఐతో వ్యక్తుల ప్రవర్తనను గమనిస్తూ కొనుగోలు నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు.

By - Tupaki Desk
Update: 2026-11-27 05:21 GMT

తన ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేస్తున్నారని కేరళ సీఎం వి.డి. సతీశన్ అన్నారు. తనపై నిఘా ఉందని, ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు కావాలనే అబద్ధాలు చెబుతానని తెలిపారు. తన సంభాషణలు వింటున్నవారిని తప్పుదారి పట్టించేందుకే అలా చేస్తానని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తన కాలేజీ రోజుల నాటి ఓ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు సతీశన్. అప్పట్లో జార్జ్ ఆర్వెల్ రాసిన '1984' నవల చదివానని చెప్పారు. ప్రతి ఒక్కరినీ నిరంతరం గమనించే సమాజం గురించి అందులో ఉంటుందని, ఆ పుస్తకం చదివిన తర్వాత నెల రోజుల పాటు భయంతో గడిపానని తెలిపారు.

ప్రస్తుతం ఏఐ వినియోగం పెరుగుతున్న తీరుపైనా ఆయన మాట్లాడారు. మనుషులు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అలవాటును క్రమంగా కోల్పోతున్నారని అన్నారు.

షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు, ఏఐ వ్యవస్థలు అక్కడికి వచ్చే కస్టమర్ల కదలికలను గమనిస్తున్నాయని చెప్పారు. వారి ప్రవర్తన, ఆసక్తులను బట్టి ప్రకటనలు చూపిస్తున్నారని, చివరకు ఏ వస్తువు కొనాలన్న నిర్ణయాన్ని కూడా ఇవి ప్రభావితం చేస్తున్నాయని వివరించారు.

అయితే తన ఫోన్‌ను ఎవరు ట్యాప్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం సతీశన్ బయటపెట్టలేదు.

Tags:    
  • vdsatheesan 
  • keralacm 
  • keralapolitics 
  • phonetapping 
  • phonesurveillance 

Similar News

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!

2026-11-12 18:17 GMT

దీపావళికి ఉద్యోగినులకు ఐఫోన్లు.. కేరళకు చెందిన బిజినెస్ ఉమెన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్!

2026-11-07 02:10 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

గవర్నర్ వెజిటేరియన్.. రాజ్ భవన్ లో శాఖహారం.. కేరళలో ముదిరిన వివాదం

2026-10-25 11:36 GMT

నో ప్రాబ్లమ్.. మా నాన్న చూసుకుంటాడు.. యాక్సిడెంట్ చేసి ముగ్గురిని చంపి బలుపు మాటలు

2026-10-12 10:24 GMT

ఆమె రాజీనామా....బీజేపీ మేయర్ పీఠానికి షాక్

2026-10-04 19:04 GMT

రాజ‌కీయ సుడిలో 'స్వామి ప్ర‌సాదం'

2026-09-22 02:30 GMT

జపాన్ లో సెంచరీ...డెడ్ ఈజీ టాస్క్ !

2026-09-17 03:45 GMT

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్..? త్వరలో కీలక మార్పులు

2026-09-11 15:30 GMT

పిల్లల డైపర్లు కూడా వదలరా.. ఏకంగా 50 లక్షలకు పైగా?

2026-09-03 07:57 GMT

Copyright @2026

Powered by Blink CMS