• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Bihar >  ప్రియుడ్ని కలిసేందుకు ఊరు...

ప్రియుడ్ని కలిసేందుకు ఊరు మొత్తాన్ని చీకట్లో ఉంచేది

| లవ్వర్ ను కలిసేందుకు.. అతడితో ఏకాంతం కోసం ఆమె ఇలాంటి పని చేస్తుందన్న విషయాన్ని గుర్తించి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-07-19 05:36 GMT

ప్రియుడ్ని సీక్రెట్ గా కలిసేందుకు అవసరమైన ఏకాంతం కోసం ఊరు మొత్తాన్ని చీకట్లో ఉంచేసిన యువతి ఉదంతం ఒకటి వెలుగు చూసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో యువతి నిర్వాకం గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. బిహార్ లోని బేతియా జిల్లాలో చోటు చేసుకున్న ఈ వైనం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ ఈ ఉదంతం పెద్ద వార్తగా మారింది.

నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో రోజూ కరెంటు పోయేది. అది కూడా ఒకే సమయంలో. దీంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కరెంటు పోయిన సమయంలోనే రెండు బైకులు.. కరెంట్ మోటార్లు.. పలు మేకలు ఇలా చోరీకి గురయ్యేవి. రాత్రి అయితే కరెంటు పోవటం.. అది కూడా ఒకే టైంలో కావటం.. ఆ సమయంలోనే చోరీలు జరుగుతున్న వైనం ఆ ఊళ్లో హాట్ టాపిక్ గా మారింది.

రోజూ ఒకే టైంలో ఎందుకు కరెంటు పోతుందో ఆరా తీసిన గ్రామస్థులు.. అందుకు కారణమైన వారిని పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. చివరకు వారు గ్రామానికి చెందిన యువతిని పట్టుకున్నారు. తన ప్రియుడ్ని కలిసేందుకు వీలుగా ఆమె ఈ నిర్వాకానికి పాల్పడిన విషయాన్ని గుర్తించారు.

లవ్వర్ ను కలిసేందుకు.. అతడితో ఏకాంతం కోసం ఆమె ఇలాంటి పని చేస్తుందన్న విషయాన్ని గుర్తించి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాను ప్రియుడ్ని కలిసే సమయంలో.. ఆ విషయాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు.. గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యే ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి.. ఆపేసేది. దీంతో.. కరెంటు సరఫరా నిలిచి.. గ్రామంలో చీకట్లు అలుముకునేవి.

కరెంటు కట్ కావటానికి కారణమైన యువతీ యువకుడ్ని పట్టుకున్న గ్రామస్తులు.. సదరు యువకుడికి దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఈ ప్రేమికులను.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారికి పెళ్లికి ఓకే చేశారు. దీంతో.. కరెంటు కట్ కథకు 'శుభం' కార్డు పడినట్లైంది.

Tags:    
  • Bihar 
  • BethiaDistrict 
  • Lovers 
  • Current 
  • NaughtonPoliceStation 
  • PoliticalNews 

Similar News

నితీష్ మీద కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్...బీజేపీ మీద నిప్పులు !

2026-10-26 03:45 GMT

పీకే ప్రశంసలు...ఇండియా కూటమి వైపు నితిన్ ?

2026-10-19 04:30 GMT

పీకే ‘పీచేముడ్’.. ఈ ట్విస్ట్ ఊహించలేదు సామీ!

2026-10-18 16:30 GMT

బీహార్ యువకుడిని పెళ్లాడేందుకు రష్యా మహిళ.. వైరల్ వార్తలో నిజమెంత?

2026-10-14 18:15 GMT

బిహార్‌లో ఘోరం: పదో తరగతి విద్యార్థినిపై మూకుమ్మడి వేధింపులు.. తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ

2026-09-21 13:33 GMT

అఫిడవిట్‌లో యాక్టివా.. రోల్స్ రాయిస్‌లో షికారు! అసలు ఈ యువ లేడి ఎమ్మెల్యే కథేంటంటే?

2026-09-21 08:33 GMT

అచ్చం దానం కేసు మాదిరే మ‌హాచంద్ర ప్ర‌సాద్ సింగ్ ఉదంతం

2026-09-20 16:39 GMT

యూసీసీకి నో ...బీజేపీకి జేడీయూ గట్టి షాక్

2026-09-15 04:15 GMT

వీడియో : ఇలాంటివి మీరు చేయొద్దన్న ఆనంద్ మహీంద్ర

2026-09-10 06:18 GMT

ఆలయంలో మృత్యుఘోష‌: ప్ర‌చార‌మే ముంచింది!

2026-08-17 14:59 GMT

నితీష్ గుర్రుగా ఉన్నారా...ఎన్నాళ్ళీ వెయిటింగ్ ?

2026-08-09 04:20 GMT

చికిత్స కోసం వెళ్లి చేతిని కోల్పోయిన యువతి.. పాట్నా ఘటన సంచలనం!

2026-08-06 06:17 GMT

Copyright @2026

Powered by Blink CMS