పెళ్లైన మూడు నెలలకే భర్తకు మత్తు మందు ఇచ్చి.. మరో ఘోరం!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని సిటీ కొత్వాలి ప్రాంతంలో గల నయా బస్తీలో నివసించే నావల్ కిషోర్ అనే వ్యక్తి చిన్న కుమారుడు యశ్వంత్.;
ఇటీవల కాలంలో భార్యల చేతుల్లో బలైపోతున్న భర్తల ఘటనలు వరుసగా తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఎన్నో ఘటనలు గత కొంతకాలంగా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వివాహం అయ్యి మూడు నెలలకు భర్తకు మత్తు మందు ఇచ్చింది అతని భార్య. గుడ్డి కంటే మెల్ల మేలు అన్న సామెత అప్లై చేసుకుంటే... అతడి ప్రాణాలకు మాత్రం హాని తలపెట్టలేదు!
అవును... ఇటీవలి కాలంలో కొంతమంది భార్యలు, ప్రియుళ్ల మోజులో పడి భర్తలను కడతేర్చుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. ఈ సమయంలో పెళ్లైన మూడు నెలల తర్వాత... భర్తకు మత్తు మందు ఇచ్చిన భార్య... ఇంట్లో ఉన్న నగదు, నగలు, వెండి సామానులు తీసుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని సిటీ కొత్వాలి ప్రాంతంలో గల నయా బస్తీలో నివసించే నావల్ కిషోర్ అనే వ్యక్తి చిన్న కుమారుడు యశ్వంత్.. పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమరోఖ్ గ్రామానికి చెందిన రీనాను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వివాహం జరిగిన మూడు నెలల తర్వాత జూన్ 1న భర్తకు మత్తు మందు ఇచ్చింది రీనా.
ఇందులో భాగంగా మత్తు మందు కలిపిన ఆహార పదార్థాలను భర్తకు తినిపించింది. దీంతో.. అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం... ఆమె తన ప్రియుడు రింకుతో కలిసి ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి వస్తువులతో పాటు సుమారు 50 వేల రూపాయల నగదు తీసుకుని పారిపోయింది. ఆ మత్తు మందు ప్రభావం నుంచి తేరుకున్న భర్త.. ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు!
అనంతరం.. అతని కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో... మిస్సింగ్, దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు... రీనా, రింకు ఇప్పటికే ప్రేమలో ఉన్నారని తేల్చారు. ఈ సమయంలో వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, సూరత్ నుంచి వారిద్దరినీ అరెస్టు చేసి తీసుకొచ్చారు. వారు ఎత్తుకెళ్లిన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.