టెన్నీస్ క్రీడాకారిణి దారుణ హత్య... ఎవరు చంపారో తెలిస్తే మరింత షాక్!

అవును... హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రస్థాయి టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ (25) గురుగ్రామ్‌ నివాసముంటుంది.;

Update: 2025-07-10 15:07 GMT

తాజాగా ఓ దారుణం చోటుచేసుకుంది. అత్యంత ఘోరం జరిగిపోయింది. ఇందులో భాగంగా... హర్యాణాలోని ఓ టెన్నిస్ క్రీడాకారిణి హత్యకు గురైంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే... ఆమె కన్న తండ్రే ఆమెను కాల్చి చంపాడు. ఈ సమయంలో సుమారు ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అవును... హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రస్థాయి టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ (25) గురుగ్రామ్‌ నివాసముంటుంది. ఈ సమయంలో ఆమె తండ్రి దీపక్‌ యాదవ్‌ వెనుక నుంచి వచ్చి ఆమెపై ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరపడంతో రాధిక ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురుగ్రామ్‌ లో రాధికా యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో రాధిక గురువారం ఇంట్లో వంట చేస్తుండగా.. తండి వెనుక నుంచి వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ సమయంలో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది!

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అయితే... హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అయితే కన్న కూతురిపై ఎందుకు కాల్పులు జరిపారనే దానిపై విచారిస్తున్నట్లు తెలిపారు!

అయితే... రాధిక తండ్రి రీల్స్ చేయడంలో ఆమె కున్న ఆసక్తి చూసి కలత చెందాడని, అది కుటుంబానికి అవమానం కలిగిస్తుందని భయపడ్డాడని పోలీసు వర్గాలు తెలిపాయంటూ జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ కారణంగా గత 15 రోజులుగా తాను ఒత్తిడిలో ఉన్నానని, అందుకే చివరికి అలాంటి చర్య తీసుకున్నానని చెప్పినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News