• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  బీటెక్ డ్రాపౌట్‌ ...

బీటెక్ డ్రాపౌట్‌ హైదరాబాదీ.. నకిలీ క్యాసినో నడుపుతున్నాడు!

| అవును... నకిలీ క్యాసినో వెబ్ సైట్ రన్ చేస్తున్నాడనే ఆరోపణలతో 22ఏళ్ల హైదరాబాదీని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-05-16 10:27 GMT

డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తే... హైదరాబాద్ కు చెందిన ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డ్రాపౌట్‌ వ్యక్తి.. వయసు 22 ఏళ్లు.. చాట్ జీపీటీ ఉపయోగించి నకిలీ క్యాసినో వెబ్ సైట్ రన్ చేస్తున్నాడనేది ఆరోపణ. దీంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని హైదరాబాద్‌ లోని రాఘవేంద్రనగర్‌ కు చెందిన వ్యక్తిగా గుర్తించారని తెలుస్తుంది.

అవును... నకిలీ క్యాసినో వెబ్ సైట్ రన్ చేస్తున్నాడనే ఆరోపణలతో 22ఏళ్ల హైదరాబాదీని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు దక్షిణ గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ లో ఉంటున్నాడని, ఇంటర్నెట్‌ లో తరచూ లొకేషన్‌ లు మారుస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు సూపరింటెండెంట్ (సైబర్ క్రైమ్) రాహుల్ గుప్తా వెల్లడించారు.

ఇందులో భాగంగా... నిందితుడు మూడు వేర్వేరు డొమైన్‌ లను ఉపయోగించి వెబ్‌ సైట్‌ లను డెవలప్ చేశాడని.. అమాయక ఆన్‌ లైన్ వినియోగదారులను ఆకర్షించడానికి నకిలీ ఆన్‌ లైన్ గేమింగ్ సైట్ కోసం ఒక కంపెనీ లోగో, బ్రాండ్ పేరు, షిప్ ఫోటోలు, లోపల క్యాసినో ఫోటోలను ఉపయోగించాడని తెలిపారు.

అయితే ఈ వ్యవహారంపై సమాచారం అందిన అనంతరం చేపట్టిన విచారణలో... నిందితుడు భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో ఉన్నట్లు కనుగొనబడిందని అన్నారు. ఈ సమయంలో డేటాను మరింత విశ్లేషించినప్పుడు అనుమానితులలో ఒకరు హైదరాబాద్‌ లో నివసిస్తున్నట్లు తేలిందని.. దాని ప్రకారం ఒక బృందం హైదరాబాద్‌ కు వెళ్లిందని వెల్లడించారు.

ఈ సమయంలో తదుపరి విచారణలో నిందితుడు దక్షిణ గోవాలోని ఓ ఫైవ్‌ స్టార్ హోటల్‌ లో ఉంటున్నాడని తేలిందని పోలీసు అధికారి తెలిపారు. ఇక నిందితుడు హైదరాబాద్‌ లోని విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ లో బీటెక్‌ చదువుతూ డ్రాపౌట్‌ అయ్యాడని వెల్లడించారు. ప్రస్తుతం కేసు తదుపరి దర్యాప్తు జరుగుతుందని అంటున్నారు!

Tags:    
  • Telangana 
  • Btechstudent 
  • Casino 
  • Chatgpt 
  • Goa 
  • Cybercrime 
  • Rahulgupta 
  • Hyderabad 
  • Companylogo 
  • Brandname 
  • Shipphotos 
  • Politicalnews 

Similar News

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

హనీట్రాప్ లో ఏసీపీ.. ఇన్ స్పెక్టర్ ఎలా పడ్డారబ్బా?

2026-10-22 08:02 GMT

Apple Mass Warning.. ఐఫోన్లు కొట్టేశారా.. మామూలుగా ఉండదు!

2026-10-22 05:25 GMT

Copyright @2026

Powered by Blink CMS