కూలీ వర్సెస్ వార్ 2- తొలి వీకెండ్ లో రజనీ కాంత్ దే పైచేయి!

సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కూలీ, జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటించిన 'వార్ 2' ఆగస్టు 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి.;

Update: 2025-08-18 11:26 GMT

సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కూలీ, జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటించిన 'వార్ 2' ఆగస్టు 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. రెండు సినిమాలకు మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ.. వసూళ్లలో ఫర్వాలేదనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలు రిలీజై, తొలి వీకెండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి. ఈ క్రమంలో ఏ సినిమాకు ఎంతెంత వచ్చాయో చూద్దాం!

ఇండిపెండెన్స్ డే, లాంగ్ వీకెండ్ ముగిసింది. దీంతో వార్ 2, కూలీ తొలి వారాంతం కలెక్షన్ల లెక్కలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ లెక్కల ప్రకారం.. వార్ 2 కంటే కూలీనే ఎక్కువగా వసూల్ చేసింది. బాక్సాఫీస్ రేసులో వార్ 2 పై కూలీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

కూలీ నాలుగు రోజుల్లో దేశీయంగా రూ.194.25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. నాలుగో రోజు ఒక్క రోజే కూలీకి రూ.35 కోట్లు వచ్చాయి. అటు వార్ 2 ఇప్పటివరకు తొలి వీకెంట్ క్లోజ్ అయ్యేసరికి రూ.173.60 కోట్లు వసూల్ చేసింది. నాలుగో రోజు ఈ సినిమాకు రూ. 31 కోట్లు వసూల్ అయ్యియి. అంటే ఫస్ట్ వీకెండ్ లో వార్ 2 కంటే కూలీ రూ.20.65 కోట్లు అత్యధికంగా వచ్చాయి.

కాగా, తొలి రోజు రజనీకాంత్ కూలీ రూ.65 కోట్లు వసూల్ చేయగా, వార్ 2కు రూ.52.50 కోట్లు వచ్చాయి. అయితే రెండో రోజు కూలీకి వార్ 2 గట్టి పోటీ ఇచ్చింది. కూలీ రెండో రోజు రూ.54.75 కోట్లు కలెక్ట్ చేయగా.. వార్ 2 రూ .57.35 వసూల్ చేసింది. అంటే దాదాపు రూ.3 కోట్లు కూలీ కంటే ఎక్కువగా వార్ 2 వసూల్ సాధించింది.

ఇక మూడోరోజు నుంచి కూలీ రేసులో ముందుకు వచ్చింది. మూడో రోజు కూలీ రూ. 39.5 కోట్లు వసూలు చేయగా, వార్ 2 రూ. 33.25 కోట్ల వద్దే ఆగింది. ఇక వీకెండ్ సండే రెండు చిత్రాల వసూళ్లు కాస్త నెమ్మదించాయి. అయినప్పటికీ కూలీ రూ. 35 కోట్లు చేయగా ఎన్టీఆర్ కూలీ రూ. 31 కోట్లు వసూలు చేశాడు.

ఇక వరల్డ్ వైడ్ గా కూలీ తమిళ సినిమా రికార్డులను తిరిగి రాస్తూ.. రూ. 320 కోట్లు క్రాస్ చేసింది. అటు వార్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 215 కోట్లు దాటింది. ఇక ఓవరాల్ గా రజనీ కూలీ ఈ రేసులో ముందుంది. అయితే ఇప్పుడు లాండ్ వీకెండ్ ముగిసింది. ఇక రెండో వారంలో రెండు సినిమాలకు అసలైన పరీక్ష మొదల కానుంది. చూడాలి ఈ రేసులో రజనీ ముందుంటాడా? లేదా ఎన్టీఆర్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? చూడాలి

Tags:    

Similar News