అవతార్: అనవసరం అనుకుంటున్నారా?
అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్ సినిమాకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్ సినిమాకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవతార్ వచ్చి దాదాపుగా 17 ఏళ్లు అవుతున్నప్పటికీ ప్రేక్షకులు ఇంకా ఆ మాయాజాలం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇండియన్ ప్రేక్షకులు సైతం అవతార్ కి ఆ సమయంలో అత్యధిక వసూళ్లను కట్టబెట్టిన విషయం తెలిసిందే. అవతార్ సాధించిన విజయం నేపథ్యంలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ దాదాపు పది సంవత్సరాలు సమయం తీసుకొని అవతార్ 2 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అవతార్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్ గా వచ్చిన సినిమాకి అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని అంతా భావించారు, కానీ అవతార్ 2 సినిమా అన్ని విధాలుగా నిరాశ పరిచింది. సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్ కారణంగా ఓపెనింగ్స్ భారీగా నమోదయ్యాయి కానీ లాంగ్ రన్ లో సినిమా వసూళ్లు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదనే విషయం అందరికీ తెలిసిందే.
ఇండియాలో అవతార్ ప్రేక్షకులు...
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ముఖ్యంగా ఇంగ్లీష్ సినిమాలను అమితంగా ఆదరించే అభిమానులు అవతార్ 3 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం కాలంగా 2025 డిసెంబర్ ఎప్పుడు వస్తుందా అని అవతార్ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్ రానే వచ్చేసింది, అవతార్ సినిమా నెల అంటూ హాలీవుడ్ ప్రేక్షకులు అంతా హడావుడి మొదలుపెట్టారు. హాలీవుడ్ కి పోటీగా ఇతర పెద్ద సినిమాలు ఏవి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతే కాకుండా ఇతర విదేశీ భాషలకు సంబంధించిన సినిమాలను అవతార్ కి పోటీ లేకుండా ప్రయత్నాలు చేశారు. దాంతో అవతార్ 3 దాదాపుగా సోలో రిలీజ్ కానుంది. ఇండియాలోనూ సినిమాకు పెద్దగా పోటీ లేదు అవతార్ వీక్ లో పెద్ద సినిమాలు వచ్చేందుకు అవకాశం లేదు. దాంతో ఇండియాలోనూ భారీగా ఓపెనింగ్స్ నా సొంతం చేసుకునే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అంచనా వేశారు.
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరూన్...
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అవతార్ 3 సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందని అంతా నమ్మకం వ్యక్తం చేశారు, కానీ అదంతా గతం ఇప్పుడు అవతార్ 3 సినిమాకి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మినిమం బజ్ లేకపోవడంతో అంతా ఆశ్చర్య ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల రేంజ్ లో కాదుగా కనీసం ఒక మీడియం రేంజ్ సినిమా స్థాయిలో కూడా అవతార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ సాధించే అవకాశాలు కనిపించడం లేదని బాక్సాఫీస్ వర్గాల వారు స్వయంగా మాట్లాడుతున్నారు. సినిమాకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది, ఇప్పటి వరకు సినిమాకు హాలీవుడ్ లో ఉన్నంత బజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. దాంతో ఓపెనింగ్ పెద్ద ప్రభావం ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా అవతార్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు పెద్ద నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపడం లేదు అనేది మరో వార్త.
బాలీవుడ్లో సైతం భారీ రిలీజ్
అవతార్ 2 తో పోల్చితే ఈ సినిమాల ప్రత్యేకంగా ఉండకపోవచ్చు అని ఇండియన్ ప్రేక్షకులు భావిస్తున్నారు. పైగా అవతార్ మొదటి పార్ట్ తో పోలిస్తే రెండో పార్ట్ బాగా నిరాశపరిచింది. అందుకే మూడో పార్ట్ విషయంలో ఇండియన్ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు అనిపించడం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఫిలిం మేకర్ సైతం ఇండియాలో ప్రచారం చేస్తే బడ్జెట్ వృధా అనుకుని ఉంటారని, అందుకే ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయడం లేదని టాక్ వినిపిస్తుంది. ఇండియాలో ఎంతగా ప్రచారం చేసినా కూడా వచ్చే వరకు వసూలు వస్తాయి అదనంగా వచ్చే అవకాశం లేదు. కనుక ఇక్కడ మార్కెట్ ని లైట్ తీసుకున్నారేమో అని ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. అవతార్ ను అభిమానించే ప్రేక్షకులు మాత్రం ఎప్పుడెప్పుడు అవతార్ 3 వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు రెండవ పార్ట్ విషయంలో అసంతృప్తిగా ఉండడంతో మూడో పార్ట్ పై ఆసక్తి కనబరచడం లేదు అందుకే ఆ సినిమా గురించి వచ్చే వరకు ఆలోచించడం అనవసరం అనుకుంటున్నారేమో.