• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  కూటమికి వైసీపీ మధ్య బిగ్...

కూటమికి వైసీపీ మధ్య బిగ్ గ్యాప్ ...బాబు చెప్పిన లెక్క !

| ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 33.56 శాతం మాత్రమే వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. 2024తో పోలిస్తే కూటమి ఓటు షేర్ 3.6 శాతం పెరగగా, వైసీపీకి 6.25 శాతం తగ్గిందని తెలిపారు. ఇరు పక్షాల మధ్య ఓట్ల వ్యత్యాసం 25.34 శాతానికి చేరిందని వివరించారు. మరోవైపు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది.

By - Satya P
Update: 2026-11-09 10:58 GMT

ఏపీలో మూడు పార్టీలతో అధికార టీడీపీ కూటమి ఉంది. విపక్షంలో వైసీపీ ఒక్కటే ప్రతిపక్షంగా ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ఓటు షేర్ గ్యాప్ 2024లో చూస్తే దాదాపుగా 15 శాతంగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అది కాస్తా పాతిక శాతంగా మారింది అని చంద్రబాబు అంకెలు లెక్కలతో సహా మొత్తం వివరించారు. ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కూటమి వైసీపీల మధ్య 25 శాతం ఓటు షేర్ తేడా ఉందని వివరించారు. ఒక విధంగా చూస్తే ఇది అతి పెద్ద తేడానే. వైసీపీ బలం కూడా 2024 తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో బాగా తగ్గిపోయింది అని బాబు తనదైన విశ్లేషణ చేశారు.

ఎన్డీఏ బలం ఇదే :

ఏపీలో కూటమి పరిపాలన రెండున్నర ఏళ్ళకు చేరువ కావస్తున్న నేపధ్యంలో ఎన్డీయే బలం మరింతగా పెరిగింది అని బాబు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాల మీద ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పట్టణాలు, పరిషత్ ఎన్నికల్లో కూటమి మొత్తంగా 58.9 ఓట్ల శాతాన్ని సాధించిందని అన్నారు. అదే 2024 ఎన్నికల్లో చూస్తే కూటమికి వచ్చిన ఓటు షేర్ 55.3 శాతం అని చెప్పారు. అలా చూసుకుంటే స్థానిక ఎన్నికల నాటికి ఎన్డీఏకు 3.6 శాతం ఓట్లు పెరిగాయని అన్నారు.

వైసీపీ తగ్గింది :

ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తంగా చూస్తే 33.56 శాతం ఓటు షేర్ మాత్రమే వైసీపీకి దక్కింది అని బాబు చెప్పారు. ఇదే వైసీపీకి 2024 ఎన్నికలలో 39.81 శాతం ఓటు షేర్ వచ్చిందని అన్నారు. అలా 2024 తో పోలిస్తే వైసీపీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని బాబు లెక్క ఎప్పారు. అలా చూస్తే టోటల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి వైసీపీకి మధ్య 25.34 శాతం మేర భారీ గ్యాప్ ఉందని తేల్చారు. ఇక పట్టణాలలో చూస్తే ఎన్డీఏ ఓట్ షేర్ 59.9 శాతంగా ఉంటే వైసీపీ ఓటు షేర్ 34.3 శాతంగా ఉందని అన్నారు. ఇక్కడ ఫలితాలు చూస్తే ఎన్డీఏ స్ట్రైక్ రేట్ 94 శాతం అని చెప్పారు.

పరిషత్తు ఎన్నికల్లో :

అదే విధంగా పరిషత్తు ఎన్నికల్లో చూస్తే జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ షేర్ 57.6 శాతంగా ఉంటే వైసీపీ 39.7 శాతంగా ఉందని అన్నారు. అలా ఎన్డీఏ స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా వచ్చిందని చెప్పారు. అలాగే పట్టణాల్లో 25.60 శాతం పల్లెల్లో 17.9 శాతం మేర కూటమికి వైసీపీకి మధ్య ఓట్ల శాతంలో తేడా ఉందని అన్నారు. అలాగే ఎంపీటీసీల ఎన్నికల్లో చూస్తే 9818 స్థానాలకు గానూ కూటమి 7803 స్థానాలు దక్కాయని బాబు చెప్పుకొచ్చారు. అలా రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. ఏపీలో 28 జెడ్పీ పీఠాలలో వైసీపీ ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే గెలుచుకుందని మిగిలిన చోట కూటమే ఆధిపత్యం గా ఉందని బాబు విశ్లేషించారు.

వైసీపీకి భారీ లోటు :

బాబు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఏపీలో వైసీపీకి ఓటు షేర్ 40 శాతం కాదు అని అది దాదాపుగా 34 శాతానికి పడిపోయింది అని అంటున్నారు. రెండున్నరేళ్ళ కాలంలో వైసీపీ ఓటు షేర్ ఆరు శాతం తగ్గడం అన్నది కూటమి ప్రభుత్వం విజయంగా చెబుతున్నారు. అలాగే కూటమికి దాదాపుగా అదనంగా మరో నాలుగు శాతం ఓటు షేర్ పెరిగింది అని అంటున్నారు. ఈ లెక్కన పాతిక శాతం బిగ్ గ్యాప్ తో కూటమి వైసీపీ మధ్య ఏపీలో రాజకీయ పోరు సాగుతోంది అన్నది కూటమి వైపు నుంచి వినిపిస్తున్న మాట. అయితే తమకు నామినేషన్లు వేసుకునే చాన్స్ ఇవ్వలేదని ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రిగ్గింగ్ అని వైసీపీ అంటోంది. మరి కూటమి బలం పెరిగిందా వైసీపీ తగ్గిందా అంటే అందుబాటులో ఒక్క ఓట్ల లెక్కలు ఇవే చెబుతున్నాయి. సో ఇప్పటికి అయితే కూటమి బాహుబలిగా మారింది అనే మూడు పార్టీల నేతలు గట్టిగా చెబుతున్నారు.

Tags:    
  • andhrapradesh 
  • chandrababu 
  • ndacoalition 
  • ysrcp 
  • aplocalelections 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

Copyright @2026

Powered by Blink CMS