గంటన్నర 'స్టోలెన్'.. మస్ట్ వాచ్ బుల్ మూవీ!

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో ఈ వారం విడుదలైన సినిమాల్లో స్టోలెన్ అనే మూవీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.;

Update: 2025-06-09 04:29 GMT

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో ఈ వారం విడుదలైన సినిమాల్లో స్టోలెన్ అనే మూవీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ చిత్రం కోసం ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ మూవీ గురించి తెలుసుకుందాం.

అభిషేక్ బెనర్జీ, శుభం, మియా మేల్జర్ లీడ్ రోల్స్ లో నటించిన స్టోలెన్ మూవీకి కరణ్ తేజ్‌ పాల్ దర్శకత్వం వహించారు. 93 నిమిషాల రన్ టైమ్ తో కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఓ చిన్న పాప కిడ్నాప్, అందులో అనుకోకుండా ఇరుక్కునే ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ మూవీ అంతా తిరుగుతుంది. ఒక్క రాత్రిలోనే సినిమా అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది.

ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా రూపొందిన స్టోలెన్ మూవీ ప్రస్తుతం హిందీలో అందుబాటులో ఉంది. హిందీ ఆడియో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉన్న సినిమా మస్ట్ వాచ్ అని అంతా చెబుతున్నారు. ప్రతి సీన్ కు ఓ ట్విస్ట్ ఉందని, ఎక్కడ బోర్ కొట్టని కాన్సెప్ట్ తో మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉందని అంటున్నారు. మస్ట్ వాచ్ అంటూ రికమండ్ చేస్తున్నారు.

నెమ్మదిగా ఇన్వెస్టిగేటివ్ డ్రామా నుంచి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ గా మారుతుందని రివ్యూ ఇస్తున్నారు. ముఖ్యంగా క్యాస్టింగ్ అందరూ అద్భుతంగా నటించారని కొనియాడుతున్నారు. కరణ్ తేజ్‌ పాల్ డైరెక్షన్ చాలా బాగుందని అంటున్నారు. అయితే ఆయనకు ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. గ్రిప్పింగ్ నెరేషన్ తో సినిమాను తెరకెక్కించారు.

సరోగసీ, పిల్లల కిడ్నాపింగ్ ఘటనల ఆధారంగా తీసిన సినిమాలో ఎక్కడా అనవసరమైన సీన్స్ పెట్టలేదని చెప్పాలి. తక్కువ రన్ టైమ్.. ఎక్కువ క్వాలిటీతో ఇంట్రెస్టింగ్ గా సినిమాను రూపొందించి ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నారు. థ్రిల్లర్ మూవీ అయినా ఎమోషన్స్ ఫుల్ గా ఉన్నాయని చెబుతున్నారు.

స్టోరీ లైన్ ఏంటంటే.. ఓ చిన్న ఊరి రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న మహిళ పక్కన ఉన్న చిన్నారిని ఎత్తుకుపోతారు. ఆ మహిళకు సహాయం చేయాలనుకునే ఇద్దరు సోదరులు ఆ కేసులో ఇరుక్కుంటారు. వాళ్లే కిడ్నాప్ చేశారని అంతా భావించి టార్గెట్ చేస్తారు. అసలు వారెలా తప్పించుకున్నారు? కిడ్నాప్ ఎవరు చేశారు? చివరకు ఏం జరిగిందనేది? స్టోలెన్ సినిమా.

Tags:    

Similar News