సెప్టెంబర్ లో విడుదలయ్యే చిత్రాలు ఇవే.. ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు, సిరీస్లు!

మరి ఈ సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే చిత్రాలు ఏంటి? అటు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవి అనే విషయం ఇప్పుడు చూద్దాం.;

Update: 2025-09-01 12:08 GMT

ఎప్పటిలాగే ఈ నెల కూడా థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు సిద్ధం అవుతుండగా.. అటు ఈ వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ముస్తాబవుతున్నాయి. మరి ఈ సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే చిత్రాలు ఏంటి? అటు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవి అనే విషయం ఇప్పుడు చూద్దాం.

సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న చిత్రాలు ఇవే..

సెప్టెంబర్ నెలలో యాక్షన్ తో పాటు ఇటు వినోదాన్ని పంచడానికి ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి.

సెప్టెంబర్ 5:

1.ఘాటీ

2. లిటిల్ హార్ట్స్

3. మదరాసి

4. బాఘీ 4

సెప్టెంబర్ 12:

1. మిరాయ్

2. కిష్కిందపురి

3. కాంత

4. త్రికాలి

సెప్టెంబర్ 19:

1. భద్రకాళి

2. జాలీ ఎల్.ఎల్.బి 3

సెప్టెంబర్ 25:

ఓజీ

సెప్టెంబర్ మొదటివారం ఓటీటీలో సందడి చేయబోతున్న చిత్రాలు, సిరీస్ లు

థియేటర్లలోనే కాదు ఓటీటీ లలో కూడా ప్రేక్షకులను అలరించడానికి క్రైమ్, సస్పెన్స్, రొమాంటిక్, థ్రిల్లర్, స్పై, యాక్షన్ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని ఆల్రెడీ ఓటీడీలోకి వచ్చేసాయి. సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 మధ్య ఓటీటీ లో సందడి చేయబోయే చిత్రాల జాబితా కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం

నెట్ ఫ్లిక్స్:

ది ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబర్ 3

ఇన్ స్పెక్టప్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబర్ 05

జియో హాట్ స్టార్:

ట్రేడ్ అప్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబర్ 1

లిలో అండ్ స్టిచ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబర్ 3

అమెజాన్ ప్రైమ్:

ఔట్ హౌస్ (హిందీ సినిమా) - సెప్టెంబర్ 1

సన్ నెక్స్ట్ :

సరెండర్ (తమిళ్ మూవీ) - సెప్టెంబర్ 4

ఫుటేజ్ (మలయాళం మూవీ) - సెప్టెంబర్ 5

ఆపిల్ ప్లస్ టీవీ:

హైయెస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబర్ 5

ఎంఎక్స్ ప్లేయర్:

రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబర్ 6

వీటితో పాటూ గతవారం స్ట్రీమింగ్ కి వచ్చిన మూడు ఫేమస్ సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

1. కింగ్డమ్ - ఆగస్ట్ 27

విజయ్ దేవరకొండ హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ తదితరులు కీలకపాత్రలో వచ్చిన చిత్రం కింగ్డమ్. శ్రీలంక ద్వీపానికి రహస్య మిషన్ కోసం కానిస్టేబుల్ సూరి వెళ్తాడు.. అక్కడ తప్పిపోయిన తన సోదరుడు శివతో తిరిగి కలవడం.. బంగారు అక్రమ రవాణా ముఠాను ఏ విధంగా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. లవ్ అన్ టాంగిల్డ్ - ఆగస్టు 29

1998లో జరిగే కథతో ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని రూపొందించారు. ఇది ఆగస్టు 29 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

3. మెట్రో ఇన్ దినో - ఆగస్టు 29

బాలీవుడ్ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మెట్రో నగరంలోని వివిధ తరాల జంటలను అనుసరిస్తుంది. ఆదిత్యారాయ్ , పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్ తదితరులు నటించారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 29 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

Tags:    

Similar News