బిగ్ బాస్ 9.. ఆమె చుట్టూ ఆ ఇద్దరు..?
బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా ఒక జంట ఏర్పడేలా ఉంది. ఐతే విచిత్రం ఏంటంటే ఒక రాధ ఇద్దరు కృష్ణులు అన్నట్టుగా.. ఒకే అమ్మాయి ఇద్దరితో ఫ్లర్టింగ్ కార్యక్రమాలు చేస్తుంది.;
బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారంలోనే పులిహోర కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో కొందరు కేవలం ఆట మాత్రమే ఆడతారు.. కొందరు ఫ్రెండ్ షిప్ బిల్డ్ చేసుకుంటారు. కొందరు ఆ రెండు చేస్తుంటారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే అన్నిటినీ బ్యాలెన్స్ చేసి ఆడియన్స్ మనసులు గెలుస్తారో వాళ్లే టైటిల్ దక్కించుకుంటారు. ప్రతి సీజన్ లో పులిహోర కార్యక్రమాలు కామన్. ఒకే హౌస్ లో ఉంటూ ఏదో సరదాగా అలా ఇద్దరు ప్రేమ పక్ష్లుగా మారి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటారు. కానీ అది వాళ్ల ఆటకి ఆటంకం కలిగిస్తుందని గుర్తించరు.
సీజన్ 9 లో కూడా ఒక జంట..
బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా ఒక జంట ఏర్పడేలా ఉంది. ఐతే విచిత్రం ఏంటంటే ఒక రాధ ఇద్దరు కృష్ణులు అన్నట్టుగా.. ఒకే అమ్మాయి ఇద్దరితో ఫ్లర్టింగ్ కార్యక్రమాలు చేస్తుంది. సీజన్ 9 లో సెలబ్రిటీ కంటెస్టెంట్ గా వచ్చిన రీతు చౌదరి కామనర్స్ గా వచ్చిన డీమాన్ పవన్, కళ్యాణ్ పడాలతో క్లోజ్ గా ఉంటుంది. పవన్ కోసం ఆమె అన్నం ముద్దలు కూడా తినిపిస్తుంది. కళ్యాణ్ పడాలతో ప్రేమగా మాట్లాడుతూ అతన్ని బుట్టలో పడేస్తుంది.
ఈ ప్రయత్నాలు కచ్చితంగా కంటెంట్ ఇవ్వడానికే అని ఆడియన్స్ కు అర్థమవుతుంది. డిమాన్ పవన్ రీతు చూపించే అభిమానం, ప్రేమకి దాదాపు పడిపోయినట్టే ఉన్నాడు. కళ్యాణ్ పడాలని కూడా రీతు ఫ్లర్ట్ చేస్తుంది. మరోపక్క తనూజ కళ్యాణ్ పడాల ఇద్దరి మధ్య కూడా ఏదో జరుగుతుంది అన్నట్టుగా ఉంది.
సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్..
మొత్తానికి సీజన్ 9 లో ఈ కొత్త టర్న్ మాత్రం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ లో భాగంగా ఓనర్స్, టెనంట్స్ అంటూ వాళ్లని డివైడ్ చేసి ఆట కొనసాగిస్తున్నారు. టెనంట్స్ లో ఉన్న భరణి ఈ వీక్ ఓనర్ గా ప్రమోట్ అయ్యాడు. ఇక ఈ సీజన్ ఫస్ట్ కెప్టెన్ గా సంజన ఉండగా రెండో వారం కెప్టెన్సీ టాస్క్ ప్రస్తుతం హౌస్ లో జరుగుతుంది.
బిగ్ బాస్ సీజన్ 9లో కామ్నర్ గా వచ్చిన హరీష్ హౌస్ లో అందరి మీద అలిగి 3 డేస్ ఏమి తినకుండా ఉన్నాడు. ఈ వీక్ నామినేషన్స్ లో కూడా అదే రీజన్ చెప్పి కొందరు అతన్ని నామినేట్ చేశాడు. ఈ వీక్ అతన్ని బయటకు పంపిస్తారన్న టాక్ నడుస్తుంది. ఓటింగ్ ప్రకారం అయితే హరీష్ వెళ్లే ఛాన్స్ లేదు. మరి వీకెండ్ ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్.