ఫ్రైడే స్పెషల్.. ఓటీటీలో సందడి చేస్తున్న తెలుగు హిట్ మూవీస్!

ఇకపోతే రాకాస, బైకర్ రెండూ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండూ విభిన్నమైన జానర్లు.. అందుకే థియేటర్లలో రెండింటికీ ఆడియన్స్ పట్టం కట్టారు.;

Update: 2026-05-01 06:20 GMT

థియేటర్లలో సందడి చేసిన ప్రతి సినిమా కూడా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా థియేటర్లలో నచ్చింది అంటే ఓటీటీలో కూడా మళ్లీమళ్లీ చూస్తూ ఆ సినిమాలకు పట్టం కడుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెండు తెలుగు చిత్రాలు సిద్ధమైపోయాయి. అసలే వేసవి సెలవులు.. పైగా ఫ్రైడే మూవీస్ కోసం ఎదురుచూసే అభిమానులకు ఈ రెండు తెలుగు చిత్రాలు భారీ సర్ప్రైజ్ అందించాయి.

అందులో ఒకటి నిహారిక రాకాస.. సంగీత్ శోభన్ , నయన్ సారిక జంటగా వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి , రోహిణి, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ మూడవ తేదీన థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన సొంతం చేసుకుంది. మానసా శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదెల నిర్మించింది. థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు అధికారికంగా నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ కి అరంగేట్రం చేసింది. నేటి నుంచి ఈ సినిమా ప్రేక్షకులను ఓటీటీ ద్వారా అలరించడానికి సిద్ధం అయ్యింది . తెలుగులో విడుదలైన ఈ సినిమా ఓటీటీ వెర్షన్లో మాత్రం తమిళ్ , కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రావడం గమనార్హం. మొత్తానికైతే ఇలా ఓటీటీ లో వివిధ భాషలలో స్ట్రీమింగ్ చేయడం వల్ల వివిధ ప్రాంతాలలో ప్రేక్షక వర్గానికి చేరువయ్యాలా చిత్ర బృందం ఈ విధంగా ప్లాన్ చేసింది. అనుదీప్ దేవ్ సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారాయి.

ఈ ఫ్రైడే స్పెషల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మరో చిత్రం శర్వానంద్ బైకర్. ఇండియాస్ ఫస్ట్ మోటో క్రాస్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా, మాల్వికా నాయర్ హీరోయిన్గా నటించగా.. డాక్టర్ రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కాన్సెప్ట్ కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తండ్రీ కొడుకుల ఎమోషన్ తెరపై బాగా పండింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా అందుబాటులో ఉండడంతో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పెరుగుతోంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి వ్యూస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఇకపోతే రాకాస, బైకర్ రెండూ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండూ విభిన్నమైన జానర్లు.. అందుకే థియేటర్లలో రెండింటికీ ఆడియన్స్ పట్టం కట్టారు. మరి ఈ సినిమాలు ఒకే ప్లాట్ఫారం వేదికగా అందుబాటులోకి ఒకేరోజు వచ్చాయి. మరి ఈ రెండు చిత్రాలు ఎటువంటి రికార్డులు సొంతం చేసుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News