ఈ వారం ఓటీటీలోకి రానున్న క్రేజీ సినిమాలివే!
రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో సౌత్ ఇండియన్ ఓటీటీ ఆడియన్స్ అద్భుతమైన అనుభవాన్ని పొందారు. ఇప్పుడు జూన్ రెండో వారంలో మరికొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.;
రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో సౌత్ ఇండియన్ ఓటీటీ ఆడియన్స్ అద్భుతమైన అనుభవాన్ని పొందారు. ఇప్పుడు జూన్ రెండో వారంలో మరికొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు రాబోతున్నాయో, వాటి టైటిల్స్ ఏంటనేది తెలుసుకుందాం.
ముందుగా వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి కలిసి చేసిన రానా నాయుడు సెకండ్ సీజన్ జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సీజన్ మంచి హిట్ గా నిలిచింది. రానా నాయుడులో వెంకటేష్ క్యారెక్టర్, అతని భాషపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఆ సిరీస్ ను మాత్రం ఆడియన్స్ బాగానే ఆదరించారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా రానా నాయుడు సీజన్2 రిలీజ్ కు రెడీ అయింది. రానా నాయుడు విషయంలో వచ్చిన కంప్లైంట్స్ ను దృష్టిలో పెట్టుకుని రానా నాయుడు2 విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సీజన్ ను రూపొందించారు.
ఇక స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం. టీజర్ తోనే మంచి హార్రర్ కామెడీగా నిలుస్తుందనే హామీ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఇప్పుడు జూన్ 14న జియో హాట్‌స్టార్ లో శుభం ఓటీటీ అరంగేట్రం చేయడానికి రెడీ అవుతోంది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అలప్పుజ జింఖానా సినిమా మంచి టీనేజ్ డ్రామాగా నిలిచింది. థియేటర్లలో రిలీజైనప్పుడు కూడా ఈ సినిమాకు మంచి రివ్యూలొచ్చాయి. ఇప్పుడు జూన్ 13 నుంచి అలప్పుజ జింఖానా సోనీ లివ్ లో ప్రసారం కానుంది.
మలయాళ టైటిల్ తో వస్తున్న మరో సినిమా పదక్కలం. టాలెంటెడ్ యాక్టర్ సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 10 నుంచి జియో హాట్‌స్టార్ లో ప్రసారం కానుంది.
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు అనే కామెడీ సినిమా కూడా ఈ వారం ఓటీటీ లోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా నెలలవుతుంది. ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత ఆ ఒక్కటి అడక్కు సినిమా చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వస్తోంది. జూన్ 12 నుంచి ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.