• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  ఎట్టకేలకు ఓటీటీకి వచ్చిన...

ఎట్టకేలకు ఓటీటీకి వచ్చిన హిట్ క్రైమ్‌ థ్రిల్లర్‌

| తెలుగు, తమిళ భాషలతో పోల్చితే మలయాళంలో మంచి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

By - Tupaki Desk
Update: 2024-09-13 07:45 GMT

తెలుగు, తమిళ భాషలతో పోల్చితే మలయాళంలో మంచి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు వస్తాయి అనడంలో సందేహం లేదు. అన్ని భాషల్లో కూడా మలయాళ సినిమాలు డబ్‌ అవ్వడం పరిపాటిగా వస్తుంది. ఒకప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీ పరిధి చాలా తక్కువ ఉండేది. అక్కడి సినిమాలు పాతిక కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేస్తే గొప్ప విషయం అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు మలయాళ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌ లో విడుదల అవ్వడంతో పాటు, వందల కోట్ల వసూళ్లను నమోదు చేయడం మనం చూస్తున్నాం. ఇక మలయాళ సినిమాల డబ్బింగ్ వర్షన్ లు ఓటీటీ లో ఓ రేంజ్ లో హిట్ అవుతున్నాయి.

మలయాళంలో విడుదల అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుని, ఇతర భాషల్లో థియేట్రికల్‌ రిలీజ్ కాని సినిమాలు ఇప్పుడు ఓటీటీ లో వరుసగా స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కొత్త మలయాళ సినిమాలతో పాటు పాత మలయాళ సినిమాలూ డబ్బింగ్ అయి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తెలుగు ఓటీటీ ప్రేక్షకులు మలయాళ డబ్బింగ్ సినిమాలను ఆదరించడం తో వరుసగా వస్తూ ఉన్నాయి. మే నెలలో వచ్చిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'తళవన్‌' సూపర్‌ హిట్ గా నిలిచింది. ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్ లు సాగించే ఒక ఎంక్వైరీ కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

థియేట్రికల్‌ రిలీజ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తళవన్ ను ఓటీటీ ప్రేక్షకులు చూసేందుకు దాదాపు మూడు నెలలుగా వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు తళవన్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మలయాళ సినిమా డబ్బింగ్ వర్షన్ అయినా కూడా ఓటీటీ లో తెలుగు ప్రేక్షకులు తెగ చూస్తూ ఉన్నారు. తాజాగా తళవన్ సినిమాను కూడా తెలుగు తో పాటు, తమిళ, హిందీ ప్రేక్షకులు ఎక్కువ మంది చూస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా ట్రెండ్‌ అవుతోంది.

ఒక టీవీ కార్యక్రమంలో రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ 5 సంవత్సరాల క్రితం చేసిన ఎంక్వైరీ గురించి చెబుతూ సినిమా కథను ప్రారంభించడం జరిగింది. క్రైమ్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమా లో పోలీసు ఆఫీసర్స్ పాత్రల్లో ఆసిఫ్‌ ఆలు, బిజు మీనన్‌ లు నటించారు. ఇద్దరు కలిసి చేసే దర్యాప్తులో ఎదుర్కొనే సవాళ్లు, వారిద్దరి మధ్య మానసిక సంఘర్షణ ల ఆధారంగా సినిమా కథ ను రూపొందించడం జరిగింది. ఒక మంచి సినిమా ను ఓటీటీ లో ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్‌ న్యూస్ చెబుతూ ఇటీవలే సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్‌ ప్రారంభం అయింది.

Tags:    
  • Mollywood 
  • Thalavan 
  • Movie 
  • Crimethriller 
  • OTT 
  • Sonylive 
  • Malayalam 

Similar News

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

2026-11-01 12:04 GMT

కీర్తి 'అక్క'.. టాక్ ఎలా ఉంది?

2026-11-01 05:14 GMT

డిజిటల్ స్పేస్‌లో బోల్డ్ స్టోరీల వెనుక లాజిక్!

2026-11-01 00:30 GMT

Bigg Boss Telugu 10: ఝాన్సీ ఎలిమినేటెడ్, సీక్రెట్ రూమ్కి రోహిత్?

2026-10-31 18:16 GMT

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ GAME’ డిజిటల్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ తేదీ ఇదే!

2026-10-31 15:42 GMT

'వారణాసి'కి మళ్లీ అదే ప్లానా!

2026-10-31 12:42 GMT

రోహిత్ అమన్ ల మధ్య రగిలిన చిచ్చు

2026-10-31 04:02 GMT

Copyright @2026

Powered by Blink CMS