ఇంట్రెస్టింగ్ గా 'కేరళ క్రైమ్ ఫైల్స్ -2' ట్రైలర్!
అహ్మద్ కబీర్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఆద్యంతం సరికొత్త అనుభూతిని పంచింది.;
ఓటీటీ వేదిక ఆశ్చర్యపోయే కంటెంట్ తో అలరిస్తునంది. వెబ్ సిరీస్ లు...డాక్యుమెంటరీలతో హాలీవుడ్ సినిమాల్ని మించి తీస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్లు, సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతుంది. దీంతో ఈ తరహా కంటెంట్ కి నవతంరం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది డిస్నీ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయిన కేరళ క్రైమ్ పైల్స్ థ్రిల్లర్ ప్రియుల్ని ఓరేంజ్ లో అలరించింది.
అహ్మద్ కబీర్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఆద్యంతం సరికొత్త అనుభూతిని పంచింది. అజు వర్గీస్, లాల్ , జిన్ షాన్, నివాస్ వాలిక్కును లాంటి నటులతో తమదైన నటనతో థ్రిల్లర్ ప్రియుల్ని అలరించారు. తాజాగా ఇప్పుడా సిరీస్ కు కొనసాగింపు గా `కేరళ క్రైమ్ ఫైల్స్ : ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు 2` సిద్దమైంది. ఈసారి మరో సరికొత్త క్రైమ్ కథాంశంతో రూపొందింది.
తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ జియో హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. తిరువనతపురం జిల్లాలో ఐదుగురు ఎస్ హెచ్ వోలు వేర్వేరు స్టేషన్లలో 12 మంది సివిల్ పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారంటూ ఆసక్తికరంగా ట్రైలర్ మొదలవుతుంది. ఆ పోలీసులు ఎందుకు సస్పెండ్ అయ్యారు? వారంతా ఎవరిని వెతుకు తున్నారు? చివరికి వారు దొరికారా? లేదా? అన్నది కథగా తెలుస్తుంది. ప్రపంచం అంతే సర్.
క్రిమినల్స్ మంచిగా ఉండాలని మనం అనుకోకూడదు? అంటూ సంస్పెడ్ అయిన పోలీస్ చెప్పే డైలాగ్ ట్రైలర్ చివర్లో ఆకట్టుకుంటుంది. మంచికి...చెడుకి జరుగుతోన్న సారాశంగా ట్రైలర్ హైలైట్ అవుతుంది. బీజీఎమ్ ఆసక్తికరంగా ఉంది. కొత్త సిరీస్ లో అదనంగా చాలా కొత్త పాత్రలు కనిపిస్తున్నాయి. వాటిని ముడిపెట్టిన తీరు రక్తి కట్టిస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.