• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  సున్నా నుంచి సెంచరీకి.....

సున్నా నుంచి సెంచరీకి.. తిలక్ చెప్పిన ఫన్నీ విషయం ఏమిటి?

| ఈ కుర్రాడు కచ్చితంగా ఇండియాకు ఆడతాడు అని అనిపించింది.

By - Tupaki Desk
Update: 2024-11-16 19:30 GMT

టీమ్ ఇండియా టి20 ఫార్మాట్ లో తెలుగు వారికి చోటు కష్టమేనా..? టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమా..? ఆధునిక క్రికెట్ లో బాగా ఆదరణ పొందిన టి20లు ఆడే సత్తా తెలుగువారిలో లేదా.?? మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రాల నుంచి దూకుడైన బ్యాట్స్ మన్ రాడా..? అంటే.. దీనికి సమాధానంగా నిలిచాడు 22 ఏళ్ల తిలక్ వర్మ. సరిగ్గా ఆరేళ్ల కిందటే తిలక్ పేరు హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో చర్చకు వచ్చింది. ఈ కుర్రాడు కచ్చితంగా ఇండియాకు ఆడతాడు అని అనిపించింది. దానిని నిలబెట్టుకున్నాడు తిలక్.

తొలి తెలుగోడు.. మలి తెలుగోడూ..

భారత దేశానికి అజహరుద్దీన్ నుంచి విహారి వరకు మంచి బ్యాట్స్ మెన్ ను అందించిన తెలుగు రాష్ట్రాలు.. టి20 ఫార్మాట్ కు తగిన బ్యాట్స్ మన్ ను అందించడంలో వెనుకబడ్డాయి. అలాంటి స్థితిలో వచ్చిన తిలక్.. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టి20లో సెంచరీ కొట్టాడు. దీంతో పొట్టి ఫార్మాట్ లో సెంచరీ కొట్టిన తొలి తెలుగోడిగా నిలిచాడు. ఇక శుక్రవారం జరిగిన నాలుగో టి20లోనూ తిలక్ సెంచరీ కొట్టి ‘మలి తెలుగోడు’గా నిలిచాడు. వీటన్నిటికీ మించి.. టి20ల్లో సెంచరీ కొట్టిన అతి చిన్న వయస్కుడు (22 ఏళ్ల 5 రోజులు)గా తిలక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అదే విజయ రహస్యం..

దక్షిణాఫ్రికా వంటి జట్టుపై దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ కొట్టడం అంటే మాటలు కాదు. కానీ, రెండు సెంచరీలు కొట్టాడు. దీనిని తాను ఎప్పుడూ ఊహించలేదన్నాడు తిలక్ వర్మ. కాగా, దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ లలో తిలక్ 280 పరుగులు చేశాడు. ఇందులో రెండు అజేయ సెంచరీలు ఉన్నాయి. 21 ఫోర్లు, 20 సిక్స్‌ లు కొట్టాడు. కాగా, ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డుతో పాటు మూడో, నాలుగో టి20ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు తిలక్ కే దక్కింది. కాగా, నిరుడు దక్షిణాఫ్రికాలో పర్యటించిన జట్టులోనూ తిలక్ వర్మ ఉన్నాడు. కానీ, ఓ మ్యాచ్ లో డకౌట్‌ అయ్యాడు. తాజాగా ఆ సంగతిని గుర్తు చేస్తూ.. ‘‘మీకో ఫన్నీ విషయం చెప్పాలనుంది. నిరుడు జోహెన్నెస్‌ బర్గ్‌ లో జరిగిన మ్యాచ్‌ లో తొలి బంతికే (గోల్డెన్) డకౌట్‌ అయ్యా. మళ్లీ అవకాశం వస్తే గట్టిగా నిరూపించుకోవాలని అనుకున్నా. ఇప్పడు సెంచరీ కొట్టి దానిని సాధించా’ అని వివరించాడు.

అతడి వెనుక సూర్య..

తిలక్ మూడో టి20లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను అడిగి మరీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. నాలుగో మ్యాచ్ లో నూ అలానే చేశాడు. దీంతో రెండు సెంచరీల అనంతరం అతడు సూర్య వైపు ముద్దులు పెట్టాడు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్ లో భారత జట్టు కోచ్ గా హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించాడు. ఓ దిగ్గజ బ్యాట్స్ మన్, అదీ సొంత ఊరికి చెందిన ఆటగాడి ఎదుట సెంచరీలు కొట్టడం అంటే.. తి‘లక్కీ’నే.

Tags:    
  • TeamIndia 
  • IPL 
  • BCCI 
  • Test 
  • ODIs 
  • Tilakvarma 
  • Interview 
  • Comments 
  • Azharuddin 
  • Vihari 
  • T20I 
  • SouthAfrica 
  • MumbaiIndians 
  • MI 
  • IPL2024 
  • Suryakumaryadav 

Similar News

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

Copyright @2026

Powered by Blink CMS