• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  ప్రపంచ కప్ లో టీమిండియా...

ప్రపంచ కప్ లో టీమిండియా జెర్సీ.. భారత్ అనా? లేక ఇండియా అనా?

| జి-20 సదస్సు ఈ వారాంతంలో ప్రారంభం కానుంది. అమెరికా, రష్యా, చైనా సహా అనేక అగ్ర దేశాలు సభ్యులుగా ఉన్న కూటమి ఇది

By - Tupaki Desk
Update: 2023-09-07 06:21 GMT

ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన అంశం దేశం పేరు మార్పు. ప్రతిష్ఠాత్మక జి20 సదస్సుకు ముందు ఉన్నట్లుండి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సాక్షాత్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జి20 సదస్సు అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో 'President of India'కు బదులుగా 'President of Bharat' అని ఉండడం మొత్తం చర్చకు కేంద్రమైంది. దీంతోపాటు 20 మంది విదేశీ అతిథులకు పంపిణీ చేయనున్న పుస్తకాల్లోనూ ఇండియాకు బదులు భారత్‌ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీని కూడా 'ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌' అని ప్రస్తావించారు. దీంతో దేశం పేరు 'ఇండియా' స్థానంలో 'భారత్‌'గా స్థిరీకరించేందుకు మోదీ సర్కారు చర్యలు చేపట్టనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు పేరు లోతుల్లోకి వెళ్తే.. ఇంకా అనేక విశ్లేషణలు చేయాల్సి ఉంటుంది.

అటు ప్రతిష్ఠాత్మక సదస్సు.. ఇటు ప్రతిష్ఠాత్మక టోర్నీ

జి-20 సదస్సు ఈ వారాంతంలో ప్రారంభం కానుంది. అమెరికా, రష్యా, చైనా సహా అనేక అగ్ర దేశాలు సభ్యులుగా ఉన్న కూటమి ఇది. దేశాల సంఖ్య అనే కాక.. ఆయా దేశాల విశిష్టత రీత్యా జి-7 తర్వాత అత్యంత బలమైన కూటమి ఇదే అని చెప్పొచ్చు. ఇలాంటి దేశాల కూటమి జి20 సదస్సుకు 'భారత్' ఆతిథ్యం ఇవ్వనుండడం ఎంతైనా విశిష్టమే. అయితే ఇలాంటి సదస్సుకు ముందు ఇండియా బదులు భారత్ అని వర్తమానం పంపడమే చర్చకు తావిచ్చింది. ఇదలా ఉంచితే.. వచ్చే నెల 5వ తేదీ నుంచి భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. మొత్తం 10 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీకి 2011 తర్వాత భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అంతేకాదు.. తొలిసారి భారత దేశం పూర్తిస్థాయిలో (పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక భాగస్వామ్యం లేకుండా) నిర్వహిస్తోంది. అందుకే ఇది ఎంతైనా మనకు ప్రతిష్ఠాత్మక టోర్నీనే. అందులోనూ ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఆధునికీకరించిన అహ్మదాబాద్ స్టేడియంలో తొలి మ్యాచ్ అక్టోబరు 5న జరగనుంది.

మరి జెర్సీల సంగతేంటో?

సరిగ్గా.. 28 రోజుల్లో వన్డే ప్రపంచ కప్ మొదలుకానుండగా.. జి-20 సదస్సుకు కేవలం కొన్ని రోజుల ముందు ఇండియా- భారత్ సందిగ్ధత వచ్చిపడింది. ప్రతిష్ఠాత్మక టోర్నీ కాబట్టి ప్రపంచం కళ్లన్నీ ఇటువైపే ఉంటాయి. 2011 తర్వాత మన జట్టు ప్రపంచ చాంపియన్ గానూ నిలవలేదు. కాబట్టి భారత్ కు ఈ టోర్నీ ఎంతో కీలకం. ఇక ఇంతటి పెద్ద టోర్నీకి అర్హత సాధించడమే గౌరవం. అలాంటి టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే ఆటగాళ్లు జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. మ్యాచ్ ల సందర్భంగా జట్టు (దేశం) జెర్సీ ధరించి ప్రపంచ కప్ ఆడడం అనేది ఎందరో ఆటగాళ్లకు కల. తమ జట్టు గెలిచిన్పుడో..? అద్భుత ఇన్నింగ్స్ తో సెంచరీ కొట్టినప్పుడో వారు దేశం పేరిట ఉన్న జెర్సీని చూపుతుంటారు.

ఇక ఇప్పుడు భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. ప్రపంచ కప్ లో వారు ధరించే జెర్సీలు ''ఇండియా'' పేరిట ఉంటాయా? లేక కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంలో ఉన్నట్లుగా భారత్ అని ముద్రిస్తారా? అన్నిటికి మించి ప్రపంచ కప్ నకు రమ్మంటూ వివిధ దేశాధినేతలకు పంపే ఆహ్వానాల్లో ఇండియా అని పేర్కొంటారా? లేక భారత్ అని ప్రస్తావిస్తారా? అనేది సంశయం. దీనికి ముగింపు ఎలా ఉంటుందో..? కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    
  • Teamindiajersey 
  • Bharat 
  • Indianamechange 
  • Narendramodi 
  • G20summit 
  • Presidentofindia 
  • Cricketjersey 
  • Worldcup 

Similar News

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

Copyright @2026

Powered by Blink CMS