• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  హమ్మయ్యా.. టీమిండియాకు...

హమ్మయ్యా.. టీమిండియాకు ‘లెఫ్ట్ హ్యాండ్’ కలిసి వచ్చింది..

| టీమిండియాను దురదృష్టం ఇన్నాళ్లు శని పట్టినట్టే పట్టేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 మ్యాచులకు పైగా టాప్ ఓటమి.

By - A.N.Kumar
Update: 2025-12-06 10:50 GMT

టీమిండియాను దురదృష్టం ఇన్నాళ్లు శని పట్టినట్టే పట్టేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 మ్యాచులకు పైగా టాప్ ఓటమి. టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ లో టాస్ ఓటమి నుంచి మొదలు పెడితే నిన్నటి సౌతాఫ్రికాతో 2వ వన్డే వరకూ వరుసగా 20 మ్యాచులలో టాస్ ఓడిపోయింది. కానీ ఈరోజు అద్భుతమే జరిగింది. టీమిండియాకు లెఫ్ట్ హ్యాండ్ కలిసి వచ్చింది. ఇన్నాళ్లుగా ఓడిన టాస్ ఈసారి మన పక్షాన నిలిచింది. టీమిండియాను వెంటాడిన ఈ విచిత్రమైన ‘టాస్’ శాపం ఎట్టకేలకు ముగిసినట్టైంది.

వన్డే ఫార్మాట్ లో వరుసగా 20 టాస్ లు ఓడిపోవడం అనేది ఒక ప్రపంచ రికార్డ్. ఇలా జరగడం చాలా అరుదు అని చెప్పొచ్చు. అయితే నేడు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఈ వరుస ఓటములకు భారత జట్టు ఎడమ చేతితో కెప్టెన్ రాహుల్ టాస్ వేసి బ్రేక్ చేశాడు.

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ 20 వరుస ఓటములతో గత రెండు మ్యాచులలో పెట్టిన ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకే ఈసారి భిన్నంగా టాస్ కు వచ్చాడు. ఓ ఆసక్తికరమైన పని చేశాడు. ఎప్పటిలా టాస్ నాణేన్ని కుడిచేతికి బదులుగా.. ఎడమ చేతితో ఎగరేశాడు. ఈ వింత ప్రయత్నం ఫలించింది. టీమిండియా టాస్ గెలవడం వివేశం.

వరుసగా 20 ఓటముల తర్వాత విజయం దక్కడంతో కెప్టెన్ రాహుల్ తోపాటు స్డేడియంలోని అభిమానులు సైతం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకోవడం విశేషం. టాస్ గెలిచిన ఆనందం రాహుల్ ముఖంలో కనిపించింది. చిరునవ్వుతో ఉత్సాహంగా పిడికిలి బిగించి సంబరాలు చేసుకోవడం విశేషం.టాస్ గెలిచి రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే భారత్ గెలవగా.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచింది. మూడో వన్డే ఇప్పుడు మన విశాఖలో జరుగుతోంది. సౌతాఫ్రికా ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసేసరికి 216/5 వికెట్లతో ఆడుతోంది.

ఈ మ్యాచ్ విశాఖలో జరగడం.. టీంలోకి మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు మొదటి సారి వన్డే జట్టులో చోటు కల్పించడం విశేషం. ఈ డూ ఆర్ డై ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ విజయం. సో టఫ్ ఫైట్ ప్రస్తుతం జరుగుతోంది.

ఇప్పటికే టెస్టుల్లో వైట్ వాష్ కు గురైన టీమిండియా కనీసం వన్డేల్లోనైనా సిరీస్ గెలిచి సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. కానీ అంత ఈజీగా వ్యవహారంసాగేలా కనిపించడం లేదు. ఈరోజు ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.


🚨 INDIA WON A TOSS IN ODI CRICKET. 🚨

- The celebration from captain KL Rahul. 🤣pic.twitter.com/Zca4HnYu3V

— Mufaddal Vohra (@mufaddal_vohra) December 6, 2025


Tags:    
  • teamindia 
  • klrahul 
  • odiseries 
  • southafrica 
  • visakhapatnam 

Similar News

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

2026-10-24 13:37 GMT

Copyright @2026

Powered by Blink CMS