సూర్య ‘సువ్వర్’నా?.. నిజమైన ‘సువ్వర్’ నువ్వే యూసఫ్.. ఫినాయిల్ తో కడిగినా తప్పులేదు

పాకిస్థాన్ క్రికెట్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ లైవ్ టీవీ వేదికపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు.;

Update: 2025-09-17 06:36 GMT

క్రీడలు కేవలం ఆట కాదు.. అవి సంస్కారం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి వంటి గొప్ప విలువలకు ప్రతిబింబం. కానీ భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా పాకిస్తాన్ మాజీ క్రీడాకారులు తమ మాటల ద్వారా ఆ క్రీడాస్ఫూర్తిని దిగజార్చడం చాలా బాధాకరం. ఇటీవల ఆసియా కప్‌లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై చేసిన 'పంది' వ్యాఖ్యలు దీనికి తాజా ఉదాహరణ.

*లైవ్ టీవీలో సూర్యకుమార్‌పై మహ్మద్ యూసఫ్ అసభ్య వ్యాఖ్యలు

పాకిస్థాన్ క్రికెట్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ లైవ్ టీవీ వేదికపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. సమా టీవీ చానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను “పంది” అని సంభోదించడం షాకింగ్‌గా మారింది. యాంకర్ వెంటనే యూసఫ్‌ను ఆపుతూ అలాంటి అసభ్య భాష వాడొద్దని సిగ్గుపడేలా గుర్తుచేసినా.. ఆయన తన తీరు మార్చుకోలేదు. పలుమార్లు అదే పదాన్ని ఉపయోగిస్తూ, సూర్యకుమార్‌ను ఉద్దేశించి అవమానకరంగా వ్యాఖ్యానించాడు. చర్చలో యూసఫ్ మరింత దూకుడుగా మాట్లాడుతూ.. “భారతదేశం తమ సినిమా ప్రపంచం నుంచి బయటకు రావడం లేదు. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల సహకారంతోనే పాకిస్థాన్‌ను హింసించి గెలుస్తోంది. అందుకు భారత్ సిగ్గుపడాలి” అని వ్యాఖ్యానించాడు.

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ అభిమానులు యూసఫ్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒక మాజీ క్రికెటర్ స్థాయికి తగిన తీరు కాదని మండిపడుతున్నారు. “ఓ ఆటగాడి ప్రదర్శనను విమర్శించడం వేరు.. కానీ వ్యక్తిగత స్థాయిలో దూషించడం అసభ్యం” అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తెలిపుకోవాల్సిన విషయం ఏమిటంటే, మహ్మద్ యూసఫ్ 1998 నుంచి 2010 వరకు పాకిస్థాన్ తరపున 288 వన్డేలు, 90 టెస్ట్‌లు, 3 టీ20లు ఆడి తన జట్టుకు కీలకంగా సేవలందించాడు. అలాంటి ఆటగాడి నుంచి ఇలాంటి అసభ్య ప్రవర్తన వెలువడటం క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది.

*క్రీడా విలువలపై దాడి

యూసఫ్ వ్యాఖ్యలు కేవలం ఒక ఆటగాడిపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదు, క్రీడా విలువలపై జరిగిన దాడి కూడా. భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ నుంచి మహేంద్ర సింగ్ ధోని వరకు, రోహిత్ శర్మ నుంచి విరాట్ కోహ్లీ వరకు, ఎన్ని ఒత్తిళ్లు, వివాదాస్పద పరిస్థితులు ఎదురైనా ప్రత్యర్థులకు ఎల్లప్పుడూ గౌరవం ఇచ్చారు. ఇది భారత క్రికెట్ సంస్కృతి. అందుకే భారత ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం పొందుతున్నారు.

ఓటమిని అంగీకరించలేని పాకిస్తాన్ వైఖరి

పాకిస్తాన్ క్రికెట్‌లో ఓటమి అంటే ఆత్మపరిశీలన చేసుకోకుండా నిందలు వేయడం ఒక పాత అలవాటు. అంపైర్లు, రిఫరీలు, లేదా ఇతర కారణాలపై నిందలు మోపడం పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లకు పరిపాటిగా మారింది. కానీ, చివరికి ఆటలో సాధించిన విజయమే అసలైన సమాధానం.

*భారత జట్టు మైదానంలోనే సమాధానం ఇస్తుంది

మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా పాకిస్తాన్ ప్రతిష్టను దిగజార్చాయి. ఆటలో ఓడిపోవడం సహజం, కానీ మర్యాద కోల్పోవడం క్షమించరాని తప్పు. క్రీడల స్ఫూర్తిని నిలబెట్టుకోవడం కంటే ఇలాంటి చౌకబారు విమర్శల్లో మునిగిపోవడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ మరింత నష్టపోతుంది. భారత జట్టు మైదానంలోనే తమ బ్యాట్‌తో, పరుగులతో, విజయాలతో సమాధానం ఇస్తూనే ఉంటుంది. చరిత్ర గుర్తించుకునేది ఇదే. మర్యాద కోల్పోయినవారిని మాత్రం కాలం మర్చిపోదు.

Tags:    

Similar News