• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  కలర్ జిరాక్స్......

కలర్ జిరాక్స్... క్రికెట్ రాని కొహ్లీని చూశారా?

| అతడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు పొరబడి ఆటోగ్రాఫ్‌ లు అడుగుతున్నారంటే అతడేమీ సెలబ్రెటీ కాదు సుమా... యాజ్ టీజ్ గా విరాట్ కొహ్లీలా ఉంటాడు.

By - Tupaki Desk
Update: 2023-10-12 03:56 GMT

మనిషి పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటారు. అయితే అంందులో కొంత వాస్తవం ఉందని, మరికొంత చీకట్లో బాణం లాంటి ఇష్యూ అని అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే... ముఖ్యంగా సెలబ్రెటీలను పోలిన వ్యక్తులు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటారు. ఈ ఐడెంటిటీ దొరకగానే వారు కూడా మినీ సెలబ్రెటీ అయిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా క్రికెట్ రాని కొహ్లీ ఒకరు తాజాగా హల్ చల్ చేస్తున్నారు.

అవును... చండీగఢ్‌కు చెందిన ఈ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ కార్తీక్ శర్మ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌ గా మారాడు. అతడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు పొరబడి ఆటోగ్రాఫ్‌ లు అడుగుతున్నారంటే అతడేమీ సెలబ్రెటీ కాదు సుమా... యాజ్ టీజ్ గా విరాట్ కొహ్లీలా ఉంటాడు. విరాట్‌ మాదిరి శరీరం, అతడిలాగే గడ్డం, దాదాపు అదే హైటు, అదే నవ్వుతో సహా భారత క్రికెట్‌ స్టార్‌ ని దించేశాడు కార్తీక్‌.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... కార్తీక్‌ కు విరాట్‌ కు చాలా పోలికలే ఉన్నాయి. ముఖ కవలికలు కలవడం మాత్రమే కాదు... అతడి నడక, స్టైల్, స్మైల్ కూడా విరాట్‌ నే పోలి ఉంటుంది. దీంతో... అభిమానులు సడన్ గా చూడగానే షాకైపోతున్నారు.. తెలిసిన తర్వాత తేరిపారా చూసినా ఆశ్చర్యపడుతున్నారు.

అందుకే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అతడికి ఫాలోయింగ్‌ కూడా భారీగా పెరిగిపోయింది. కార్తీక్‌ బయటకు వస్తే చాలు.. కోహ్లి వచ్చాడేమో అనుకుని వెంటపడుతున్నారట క్రికెట్ అభిమానులు. సెల్ఫీ కోసం వెంటపడుతున్నారు.. ఆటోగ్రాఫ్ కోసం అడుగుతున్నారు. అయితే... వాళ్లంతా దగ్గరకు రాగానే.. తాను కొహ్లీ కాదని చెప్పేస్తున్నాడంట.

ఇక్కడ గమనించల్సిన మరో విషయం ఏమిటంటే... ఏ ఆటతో అయితే విరాట్ కొహ్లీ ఈ స్థాయిలో ఫేమస్ అయ్యాడో.. ఆ క్రికెట్ కార్తీక్ కు రాదంట. అవును... కోహ్లిని పోలిన కార్తీక్‌ కు విరాట్ ఫేవరెట్ క్రికెటరే కానీ... క్రికెట్‌ రాదట! క్రీడలంటే ఇష్టమే కానీ ఏ క్రీడల్లోకి వెళ్లలేదట. అయితే కోహ్లి అంటే అతడికి చాలా ఇష్టం.

మైదానం బయట విరాట్‌ వ్యక్తిత్వానికి తాను ఫిదా అని చెప్పే కార్తీక్త్... తన వ్యక్తిగత జీవితంలో కోహ్లీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెబుతుంటాడు. ఇదే సమయంలో ఏదో ఒక రోజు తన క్రికెట్‌ హీరోని కలవాలనేది అతడి ఆశ అని చెబుతున్నాడు. అయితే ఇలా కోహ్లిని పోలిన ఈ కార్తీక్ గురించి తెలుసుకున్న కొన్ని సంస్థలు డాక్యుమెంటరీలు కూడా తీస్తున్నాయట. ఇందులో భాగంగా... "హ్యుమన్స్‌ ఆఫ్‌ బాంబే" పేరిట కార్తీక్‌ పై ఓ డాక్యుమెంటరీ నిర్మాణానికి సిద్ధమైందని తెలుస్తుంది.

Tags:    
  • Teamindia 
  • Cricket 
  • Formercaptain 
  • Viratkohli 
  • karthiksharma 
  • Socialmedia 
  • Viral 

Similar News

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

2026-10-24 13:37 GMT

వన్డే క్రికెట్‌లో టాప్-10 భారీ ఛేజింగ్‌లు.. చరిత్ర సృష్టించిన శ్రీలంక!

2026-10-23 04:39 GMT

Copyright @2026

Powered by Blink CMS