• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  ఎన్నికాలంలో ఐపీఎల్ భారీ...

ఎన్నికాలంలో ఐపీఎల్ భారీ షెడ్యూల్.. 2 నెలల 4 రోజులు?

| అంతేకాక.. భారీ స్థాయిలో రెండు నెలల నాలుగు రోజుల పాటు మ్యాచ్ లు జరగనున్నట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-01-22 08:30 GMT

ప్రపంచంలో అత్యంత ధనిక లీగ్.. పోటీ పరంగా అంతర్జాతీయ మ్యాచ్ కు ఏమాత్రం తగ్గని లీగ్.. రికార్డుల మీద రికార్డుల లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేసింది. ఈ ఏడాది లీగ్ మొదలయ్యేది ఎప్పుడో కాస్త స్పష్టత వచ్చింది. అంతేకాక.. భారీ స్థాయిలో రెండు నెలల నాలుగు రోజుల పాటు మ్యాచ్ లు జరగనున్నట్లు తెలుస్తోంది. బహుశా లీగ్ చరిత్రలో ఇదే అత్యంత భారీ సమయం అనుకుంటా...?

17వ సారి.. 2009లో పూర్తిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లు పూర్తయ్యాయి.. 17వ సీజన్ కు వేళైంది. అయితే, ఈసారి కాస్త షెడ్యూల్ సమస్య ఎదురవుతోంది. కారణం.. దేశవ్యాప్తంగా వచ్చే వేసవిలో ఎన్నికలు ఉండడం. 2009, 2014, 2019లోనూ ఎన్నికలు, ఐపీఎల్ ఒకేసారి వచ్చాయి. ఇది అనివార్యం. వేసవి వినోదంలా సాగే ఐపీఎల్.. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు ఒకసారైనా ఎదురుపడక తప్పదు. కాగా, ఇలాంటి సందర్భం తొలిసారి 2009 పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎదురైంది.

అప్పటికి లీగ్ రెండో సీజన్ మాత్రమే. దీంతో నిర్వహణ పరంగా కష్టమని భావించారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా.. 2009లో సీజన్ ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. అక్కడే తొలిసారి హైదరాబాద్ జట్టు దక్కన్ చార్జర్స్ విజేతగా నిలిచింది. ఇక 2014లోనూ ఎన్నికలు ఎదురయ్యాయి. కానీ, లీగ్ బలపడడంతో పూర్తి సీజన్ ను కాకుండా కొన్ని మ్యాచ్ లను గల్ఫ్ దేశం యూఏఈలో నిర్వహించారు.

కొవిడ్ కాలంలో..

కొవిడ్ మొదటి వేవ్ సమయంలో ఐపీఎల్ పూర్తిగా యూఏఈకి వెళ్లింది. అప్పట్లో సీజన్ టైమింగ్ కూడా మారింది. సెప్టెంబరు-నవంబరు మధ్యన లీగ్ నిర్వహించారు. 2021లో సెకండ్ వేవ్ నేపథ్యంలో లీగ్ ను దుబాయ్, షార్జా, అబుదాబిల్లో నిర్వహించారు. 2022 నుంచి కొవిడ్ తగ్గుముఖం నేపథ్యంలో ఐపీఎల్ కు భారత్ పూర్తిగా ఆతిథ్యం ఇస్తోంది. ఈసారి కూడా లీగ్- ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నా.. సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేగాక.. మార్చి 17 తర్వాత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. ఇక ఐపీఎల్ మార్చి 22 నుంచి మొదలవుతుందని మే 26 వరకు సాగుతుందని కథనాలు వస్తున్నాయి. అంటే రెండు నెలల 4 రోజుల పాటు ఐపీఎల్ 17వ సీజన్ అలరించనుందన్నమాట.

కొసమెరుపు: పది జట్లు తలపడే ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 26 వరకు అనుకుంటే.. దీని కంటే కాస్త ముందే ఎన్నికల షెడ్యూల్ రానుంది.. ఐపీఎల్ తుది ఫలితం మే 26న వెలువడుతుంది. అటుఇటుగా అదే సమయంలో ఎన్నికల ఫలితాలు వచ్చే చాన్సుంది. 2019లో మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈ మేరకు అంచనా వేయొచ్చు. మరి ఐపీఎల్, ఎన్నికల ఫలితాల్లో ఏది ముందే చూడాలి?

Tags:    
  • Ipl 
  • Sports 
  • Schedule 
  • Indianpremierleague 
  • Covid 
  • Uae 

Similar News

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

Copyright @2026

Powered by Blink CMS