ఈ ఐపీఎల్.. ఈ ఫైనల్.. భారత్ కు చాలా చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా?

ఇప్పుడు ఏకంగా కొత్త చాంపియన్ రాబోతోంది. 18 సీజన్లుగా ఆడుతున్నా.. ఒక్కసారి కూడా టైటిల్ కొట్టని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మంగళవారం ఐపీఎల్ ఫైనల్లో తలపడనున్నాయి.;

Update: 2025-06-03 07:24 GMT

1+8=9.. ప్రపంచంలో చాలామంది లక్కీ నంబర్ గా భావించే సంఖ్య. 2+0+2+5=9.. ప్రస్తుత సంవత్సరం.. ఇందులో కూడా 9 ఉంది.. ఈ అంకెల గోల ఎందుకంటారా? ఈ ఏడాది (2025) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్.. అందుకే 9 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది. దీనికితగ్గట్లే.. మెగా వేలం నుంచే ఐపీఎల్ 18వ సీజన్ సంచలనాలతో మొదలైంది. ఎన్నడూ లేని విధంగా (భారత్-పాక్ ఉద్రిక్తతలతో) మధ్యలో విరామం కూడా వచ్చింది. ఇప్పుడు ఏకంగా కొత్త చాంపియన్ రాబోతోంది. 18 సీజన్లుగా ఆడుతున్నా.. ఒక్కసారి కూడా టైటిల్ కొట్టని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మంగళవారం ఐపీఎల్ ఫైనల్లో తలపడనున్నాయి.

-ఓ ఆటగాడికి అత్యధిక ధర చెల్లించింది ఈ ఐపీఎల్ లోనే

(రూ.27 కోట్లు-రిషభ్ పంత్)

-ఐపీఎల్ 2008లో మొదలుకాగా.. ఒక్క ఏడాది కూడా విరామం రాలేదు. ఈసారి మాత్రం భారత్-పాక్ ఉద్రిక్తతలతో 8 రోజులు ఆగింది.

-ప్రస్తుత సీజన్ లో బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగింది. ఇంకా ఫైనల్ కూడా కాకుండానే అత్యధిక రన్ రేట్ (9.62) నమోదైంది.

-బ్యాటింగ్ యావరేజ్ 29.12 కాగా.. స్ట్రయిక్ రేట్ 152.46. ఇక అత్యధిక ఫోర్లు 2,226, అత్యధిక సిక్సర్లు 1,271, అత్యధిక అర్ధ శతక భాగస్వామ్యాలు (178) ఈసారే నమోదయ్యాయి.

-బౌలింగ్ యావరేజ్ 31.59 కాగా.. కేవలం ఏడు మెయిడిన్లు మాత్రమే వేశారు.

-ఇక ఫైనల్ పూర్తి అయితే ఈ గణాంకాలు అన్నీ మారుతాయి.

-2022లో ఐపీఎల్ లో అడుగు పెడుతూనే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ కొట్టింది. ఇదికాక కొత్త చాంపియన్ ను చూసింది 2014లో. నాడు కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత సన్ రైజర్స్ (2016) టైటిల్ కొట్టినా దీనికి పూర్వ ఫ్రాంచైజీ దక్కన్ చార్జర్స్ 2009లోనే లీగ్ విజేత కావడం గమనార్హం.

-11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్త చాంపియన్ ను చూడబోతున్నాం. మరి టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు కప్ గెలుస్తుందా? అద్భుతమైన కెప్టెన్ గా ప్రశంసలు పొందుతున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందా?

కొసమెరుపు: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాదే బాధ్యతలు చేపట్టాడు. అటు బెంగళూరు సారథి రజత్ పటీదార్ కూడా ఈ ఏడాదే కెప్టెన్ అయ్యాడు. ఫైనలిస్టు జట్లకు ఇద్దరూ కొత్త కెప్టెన్లే అన్నమాట.

Tags:    

Similar News