అగ్రరాజ్యంలో పార్కింగ్ ప్లేస్ లో చిరకాల ప్రత్యర్థుల వరల్డ్ కప్ మ్యాచ్..

ఫుట్ బాల్ లో బ్రెజిల్-అర్జెంటీనా మ్యాచ్ అంటే కొన్ని వందల కోట్ల మంది చూస్తారు.

Update: 2024-05-22 08:02 GMT

ఫుట్ బాల్ లో బ్రెజిల్-అర్జెంటీనా మ్యాచ్ అంటే కొన్ని వందల కోట్ల మంది చూస్తారు. పక్కపక్కనే ఉండే ఈ దేశాలు చిరకాల ప్రత్యర్థులు.. మరి క్రికెట్ లో..? ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య కూడా ఇలాంటి వైరమే ఉంటుంది. కానీ, అది యాషెస్ సిరీస్ జరిగినప్పుడే. అయితే, ఓ రెండు దేశాల మధ్య మాత్రం సాధారణ టి20 మ్యాచ్ జరిగినా టీవీల్లోనే వంద కోట్ల మందిపైగా చూస్తారు. మ్యాచ్ టికెట్లు ఓ నెల ముందే అయినా బుక్ అయిపోతాయి. ఒక ఓటీటీల్లో చూసేవారినీ కలుపుకొంటే కొన్ని సంఖ్య వందల కోట్లు ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక ప్రపంచ కప్ లాంటి టోర్నీ తలపడితే..? కానీ, ఈ మ్యాచ్ ఓ పార్కింగ్ ప్లేస్ లో జరగబోతోంది.

ప్రపంచంలో పెద్ద స్టేడియం నుంచి

అక్టోబరు-నవంబరులో భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే ప్రపంచ కప్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ను ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించారు. ఆరు నెలల వ్యవధిలో జూన్ 1 నుంచి టి20 వరల్డ్ కప్ జరగబోతోంది. అయితే, ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు తలపడేది స్టేడియంగా మారిన పార్కింగ్ ప్లేస్ లో కావడం గమనార్హం.

అగ్రరాజ్యంలో ఇలానా?

ఈసారి టి20 ప్రపంచ కప్ నకు కరీబియన్ దీవులు, అమెరికా వేదికగా ఉన్నాయి. టోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 29న ఫైనల్ జరగనుంది. భారత్‌, పాక్ ఒకే గ్రూపు (ఎ)లో ఉన్నాయి. జూన్ 9న న్యూయార్క్‌ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Read more!

ఆర్థిక రాజధానిలో..

అమెరికా ఆర్థిక రాజధాని, అనేక విధాలుగా డెవలప్ అయిన నగరం న్యూయార్క్. పెద్ద పెద్ద ఈవెంట్లు ఇక్కడ జరుగుతాయి. కాగా, భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్ జరగబోయే స్టేడియం ఐసెన్‌ హోవర్ పార్క్ లోపల ఉంది. న్యూయార్క్ క్రీడాకారులు ఆడుకునే అరేనాలో 16 వేల మంది కూర్చునే అవకాశం ఉంది. దాని చుట్టూ పెద్ద పార్కింగ్ స్థలం ఉంది. ఇప్పుడు స్టేడియం, పార్కింగ్ స్థలాన్ని కలిపి క్రికెట్ గ్రౌండ్‌ గా మార్చారు. ఇందులోనే భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది.

Tags:    

Similar News