• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  విడాకుల ఊహాగానాల మధ్య...

విడాకుల ఊహాగానాల మధ్య భార్య‌తో హార్దిక్ విదేశీ యాత్ర‌?

| ఇదిలా ఉంటే హార్దిక్ విదేశాలకు రహస్యంగా విహారయాత్రకు వెళ్లాడని, న్యూయార్క్‌లో నేరుగా టీమ్‌ను కలుస్తాడని సమాచారం.

By - Tupaki Desk
Update: 2024-05-29 03:58 GMT

T20 ప్రపంచ కప్ 2024 కోసం భారతదేశం సిద్ధమవుతోంది. అయితే జ‌ట్టు కీలక ఆటగాళ్ళలో ఒకరైన హార్దిక్ పాండ్యా చుట్టూ కొంత మెలో డ్రామా న‌డుస్తోంది. టీమిండియా న్యూయార్క్‌కు బయలుదేరినప్పుడు అతడు జట్టుతో చేరలేదు. అతడి వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా అతని భార్య నటాసా స్టాంకోవిక్‌తో సంబంధంలో ఏం జరుగుతుందో అర్థం కావ‌డం లేదు. ఆ ఇద్ద‌రూ విడిపోతున్నార‌ని పుకార్లు షికార్ చేస్తున్నాయి. దానిని అత‌డు ఖండించ‌నూ లేదు. అలాగ‌ని క‌లిసి ఉన్నామ‌ని చెప్ప‌నూ లేదు.

ఇదిలా ఉంటే హార్దిక్ విదేశాలకు రహస్యంగా విహారయాత్రకు వెళ్లాడని, న్యూయార్క్‌లో నేరుగా టీమ్‌ను కలుస్తాడని సమాచారం. ఈ ఊహించని ట్విస్ట్ టోర్నమెంట్‌లో భారత జట్టు ప్రయాణానికి కొంత మిస్టరీని జోడించింది. హార్దిక్ పాండ్యా విష‌యంలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాల‌నే ఆసక్తి అభిమానులకు ఉంది.

క్రిక్‌బజ్‌లోని ఒక క‌థ‌నం ప్రకారం.. ముంబై ఇండియన్స్ IPL 2024లో ఓట‌మితో ముగింపును ఎదుర్కొన్న త‌ర్వాత హార్థిక్ కెప్టెన్సీ విష‌యంలో అభిమానుల్లో చాలా అసంతృప్తి బ‌య‌ట‌ప‌డింది. IPL 2024 ప్రారంభమయ్యే ముందు, హార్దిక్ నిరంత‌రం హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మకు బదులుగా అతడిని కెప్టెన్‌గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ అభిమానులు ఈ విష‌యంలో సంతోషంగా లేరు. హార్దిక్ మైదానంలోకి వచ్చినప్పుడల్లా వారు తమ అయిష్టాన్ని క‌న‌బ‌రిచారు. ముంబై ఇండియన్స్ జట్టు చుట్టూ ఉన్న ప్రతికూలత కారణంగా పోటీలో ఉన్న‌ 10 జట్లలో ర్యాంకింగ్స్ లో అట్ట‌డుగున నిలిచారు. సాధారణంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణిస్తున్న హార్దిక్ ఈసారి అంతగా రాణించలేకపోయాడు.

``హార్దిక్ ఆట ప‌రంగా ఊహించని కొన్ని వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొంటున్నాడు.. ఈ అనుభవం అతడికి విలువైన పాఠం కావచ్చు.. ముఖ్యంగా నాయకత్వ అభివృద్ధి పరంగా.. ప్రస్తుతానికి కొన్ని విషయాలు కష్టంగా ఉన్నప్పటికీ అవి చివరికి మెరుగుపడతాయి. అత‌డు బలమైన నాయకుడిగా మారడంలో సహాయపడతాయి`` అని ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ మే 17న తమ చివరి మ్యాచ్ తర్వాత విలేకరుల స‌మావేశంలో వ్యాఖ్యానించారు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

హార్దిక్ పాండ్యా -నటాసా స్టాంకోవిచ్ మే 2020లో వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరంలో కుమారుడు అగస్త్యకు స్వాగతం పలికారు. టీ20 లీగ్‌లో తీవ్రమైన మ్యాచ్‌లతో అలసిపోయినట్లు భావించిన హార్థిక్ విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అందుకే, దేశం బయట అన్య‌ ప్రదేశానికి దాదాపు వారం రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేశాడు. అది కూడా త‌న భార్య న‌టాషాతో విహార‌యాత్ర‌లో ఉన్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జంట విహారానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవీ ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. అతడు మొదటి ప్రాక్టీస్ సెషన్ కోసం న్యూయార్క్‌లో టీమిండియాతో కలవాల్సి ఉంది.

Tags:    
  • Hardikapandya 
  • Natasastankovic 
  • Tour 
  • T20worldcup2024 
  • Teamindia 
  • Divorce 

Similar News

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

2026-10-24 13:37 GMT

వన్డే క్రికెట్‌లో టాప్-10 భారీ ఛేజింగ్‌లు.. చరిత్ర సృష్టించిన శ్రీలంక!

2026-10-23 04:39 GMT

430 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన లంకేయులు.. వన్డే చరిత్రలో రెండో అత్యుత్తమ ఛేజ్ నమోదు

2026-10-23 02:30 GMT

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. వన్డే క్రికెట్‌లో మారుతున్న బ్యాటింగ్ లెక్కలు!

2026-10-22 14:24 GMT

లక్నో నుంచి కాలినడకన వచ్చిన అభిమానికి హార్దిక్ ఇల్లు గిఫ్ట్

2026-10-20 14:33 GMT

Copyright @2026

Powered by Blink CMS