అత్తగారి దేశం ఇండియాలో '200 కొట్టిన ఆ ఒక్కడు..' వన్డేల నుంచి రిటైర్

వన్డే క్రికెట్ లో 200 (డబుల్ సెంచరీ) చేయడం అంటే మాటలు కాదు.. అసలు వన్డేలే ఎక్కువగా జరగడం లేదు కాబట్టి.. జరిగినా టి20 ప్రవాహంలో ’కొట్టుకుపోతుండడం’తో వన్డేల్లో డబుల్ సెంచరీ చాలా అరుదుగా నమోదవుతోంది.;

Update: 2025-06-02 07:35 GMT

వన్డే క్రికెట్ లో 200 (డబుల్ సెంచరీ) చేయడం అంటే మాటలు కాదు.. అసలు వన్డేలే ఎక్కువగా జరగడం లేదు కాబట్టి.. జరిగినా టి20 ప్రవాహంలో ’కొట్టుకుపోతుండడం’తో వన్డేల్లో డబుల్ సెంచరీ చాలా అరుదుగా నమోదవుతోంది. ఇప్పటివరకు వన్డే క్రికెట్ లో 12 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. వీటిలో మూడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మనే చేయడం విశేషం. మరో నాలుగు (సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్) కూడా భారత బ్యాట్స్ మెన్ నుంచి వచ్చినవే. ఇక మిగిలిన డబుల్ సెంచరీల్లో పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్, శ్రీలంక బ్యాటర్ పథుమ్ నిసంక, న్యూజిలాండ్ హిట్టర్ మార్టిన్ గప్టిల్, వెస్టిండీస్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కొట్టారు. చివరగా డబుల్ సెంచరీ నమోదు చేసింది మాత్రం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్.

అత్తగారి దేశంలో ఇక్కడ మ్యాక్స్ వెల్ గొప్పదనం ఏమంటే.. మిగతా వన్డే డబుల్ సెంచరీ వీరులు అందరూ ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఉన్న

ఓపెనర్లు. మ్యాక్సీ మాత్రం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్. ఈ డబుల్ సెంచరీని కూడా తన అత్తగారి దేశం ఇండియాలో కొట్టాడు మ్యాక్స్ వెల్. 2023 వన్డే ప్రపంచ కప్ లో అఫ్ఠానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన స్థితిలో వచ్చిన మ్యాక్సీ విధ్వంసం రేపాడు. 128 బంతుల్లో 201 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఆస్ట్రేలియాను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారానే ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ లో నిలవగలిగింది. తర్వాత సెమీస్, ఫైనల్ చేరి కప్పు కూడా కొట్టేసింది. అలా ఆస్ట్రేలియా తరఫున వన్డే డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.

149 వన్డేల్లో 3990 పరుగులు చేసిన మ్యాక్స్ వెల్ 77 వికెట్లు తీశాడు. కాగా, మ్యాక్స్ వెల్ 2012 లో తొలి వన్డే ఆడాడు. టెస్టుల్లో 2013 నుంచి ఉన్నా ఏడు మ్యాచ్ లే ఆడగలిగాడు. 116 టి20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా.. మ్యాక్స్ వెల్ 36 ఏళ్లు దాటాడు. కొంతకాలంగా ఫామ్ లో లేడు. టి20ల్లోనూ ఆకట్టుకోవడం లేదు.

భారతీయురాలు విని రామన్ ను 2022 లో పెళ్లాడాడు. విని తమిళనాడుకు చెందినవారు. ఆస్ట్రేలియాలో డాక్టర్ గా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News