• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  క్రికెట్ గ్రేటెస్ట్...

క్రికెట్ గ్రేటెస్ట్ ‘రైవల్రీ’ డాక్యుమెంటరీ ట్రైలర్..అభిమానుల పండుగే

| మరి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ మజాను ఆస్వాదించేది ఎలా..? ఆ లోటు తీర్చేందుకే వచ్చేసింది చాంపియన్స్ ట్రోఫీ.

By - Tupaki Desk
Update: 2025-01-29 12:05 GMT

ఫుట్ బాల్ లో అర్జెంటీనా-బ్రెజిల్ ఎలాగో క్రికెట్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లు అలాగా..? వన్డే, టి20ల్లో ఎక్కడైనా కానీ.. ఈ రెండు జట్లు ఎదురుపడితే వారాల ముందుగానే టికెట్లు తెగుతాయి. ఇక టెస్టుల్లో ఎలాగూ ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో తప్ప ఈ రెండు జట్లు తలపడే చాన్స్ లేదు. ఇటీవలే టి20, అంతకుముందు వన్డే ప్రపంచ కప్ లు జరిగాయి. భారత్-పాక్ ముఖాముఖి సిరీస్ లు లేవు. మరి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ మజాను ఆస్వాదించేది ఎలా..? ఆ లోటు తీర్చేందుకే వచ్చేసింది చాంపియన్స్ ట్రోఫీ.

ఫిబ్రవరి 19నుంచి పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ లో పర్యటించేందుకు భారత్ అంగీకరించలేదు. దీంతో టీమ్ ఇండియా మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తున్నారు.

భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మామూలు మాటలు కాదు కదా..? అయితే, కొన్నేళ్లుగా ఒక ట్రెండ్ నడుస్తోంది. ఈ రెండు జట్ల మ్యాచ్ సందర్భంగా ‘ఓ సెటైరికల్ వీడియో’ను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలా మ్యాచ్ కు ముందే భావోద్వేగాన్ని రగిలిగిస్తున్నారు.

ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత్-పాక్ మధ్య చరిత్రను వివరిస్తూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ ఫ్లిక్స్ తన కొత్త డాక్యుమెంటరీ, "ది గ్రేటెస్ట్ రివాల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్" పేరిట తీసుకొచ్చింది. దీని ట్రైలర్ బుధవారం విడుదలైంది.

ఇటు గంగూలీ.. అటు...?

ఈ వీడియోలో భారత దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, మేటి బ్యాటర్ శిఖర్ ధావన్, పాకిస్థాన్ దిగ్గజాలు షోయబ్ అక్తర్, ఇంజమామ్-ఉల్-హక్ లు క్రికెట్‌ లో రెండు దేశాల మధ్య పోటీ గురించి మాట్లాడడం కనిపించింది.

‘‘ఇది లెజెండ్స్ చెప్పిన అతిపెద్ద పోటీ. ది గ్రేటెస్ట్ రివాల్రీ. ఇండియా వర్సెస్ పాకిస్థాన్, ఫిబ్రవరి 7 నుంచి కేవలం నెట్‌ ఫ్లిక్స్‌ లో.. అభిరుచి, కీర్తి.. క్రికెట్ తీవ్రమైన పోటీ కథలోకి ప్రవేశించండి’’ అని నెట్ ఫ్లిక్స్ రాసుకొచ్చింది.

కాగా.. నెట్ ఫ్లిక్స్ ట్రైలర్ చూశాక అభిమానులు భారత్-పాక్ క్రికెట్ పోటీ చరిత్రను చూసేందుకు అవకాశం దక్కింది. రెండు దేశాల మధ్య క్రికెట్ కు సంబంధించి కొన్ని అద్భుత క్షణాలను తిరిగి పొందాలనే ఆసక్తి రేకెత్తేలా ట్రైలర్ ఉంది. కాగా, ది గ్రేటెస్ట్ రివాల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఫిబ్రవరి 7న నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం కానుంది.

Full View
Tags:    
  • TheGreatestRivalry 
  • IndiaVsPakistan 
  • Netflixdocumentsry 
  • Netflix 
  • IndiaaPakistanmatch 
  • India 
  • Pakistan 
  • Indianplayers 
  • Pakistabplayers 
  • Documentary 
  • Cricketrivalry 
  • Championstrophy 
  • SouravGanguly 
  • Virendersehwag 
  • SunilGavaskar 
  • ShoaibAkhtar 
  • InzamamulHaq 
  • Cricketdocumentary 
  • Netflixtrailer 
  • Historicmomentsincricket 
  • Historicmoments 

Similar News

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

Copyright @2026

Powered by Blink CMS