నఖ్వీకి షాకిచ్చేందుకు బీసీసీఐ బిగ్ ప్లాన్.. అదే జరిగితే దిమ్మ తిరుగుతుంది!
భారత క్రికెటర్ల నిరాకరణ అనంతరం ట్రోఫీ, మెడల్స్ ను తనతోపాటు నఖ్వీ తీసుకెళ్లిపోయారు. దీనిపై బీసీసీఐ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.;
ఆసియా కప్ టైటిల్ ను గెలిచినా ట్రోఫీతోపాటు మెడల్స్ ఇంకా టీమిండియా చేతికి రాని సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ గా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా వాటిని తీసుకొనేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. నాటి నుంచి పరిణామాలు తీవ్రమవుతూనే ఉన్నాయి.
భారత క్రికెటర్ల నిరాకరణ అనంతరం ట్రోఫీ, మెడల్స్ ను తనతోపాటు నఖ్వీ తీసుకెళ్లిపోయారు. దీనిపై బీసీసీఐ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో భారత జట్టుకు నఖ్వీ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ట్రోఫీ మాత్రం ఇంకా అప్పగించలేదు. ఈ క్రమంలో క్రికెట్ వర్గాల్లో మరో ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.
అవును... బీసీసీఐ లేదా టీమిండియా కెప్టెన్ నేరుగా తన వద్దకే వచ్చి ట్రోఫీని తీసుకోవాలనేది పన్నాగం పన్ని, బిగుసుకు కూర్చున్న ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ అయిన మోసిన్ నఖ్వీకి భారత్ బిగ్ షాకిచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త క్రికెట్ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. ఇందులో భాగంగా... నఖ్వీని ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచే తొలగించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో... అదే జరిగితే అటు నఖ్వీకి, ఇటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఇ నుంచి అది దిమ్మతిరిగే షాకే అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ... ఆసియా కప్ నఖ్వీ వ్యక్తిగత సొత్తు కాదని అన్నారు. అయినప్పటికీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.
ఈ సందర్భంగా స్పందించిన బీసీసీఐ... పాక్ క్రికెట్ బోర్డు, నఖ్వీ మున్ముందు ఎలా ప్రవర్తిస్తుందనేది చూడాలని.. ట్రోఫీని తనవద్దే ఉంచుకొని, భారత్ కు అప్పగించనని చెప్పే హక్కు నఖ్వీకి లేదని తెలిపింది. ఆసియా కప్ టోర్నీకి పాక్ అధికారిక ఆతిథ్యం ఇచ్చిందని, అయితే.. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీని ఇవ్వాల్సిందేనని స్పష్టంగా చెప్పింది.
మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే ఘాటుగా స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ మదన్ లాల్... విజేతగా నిలిచిన జట్టు సభ్యులు ట్రోఫీతో ప్రేక్షకులు, అభిమానుల ముందు సంబరాలు చేసుకుంటే బాగుంటుందని.. అసలు నఖ్వీకి క్రీడా పరిజ్ఞానమే లేదని అన్నారు. అతడికి ఎలా హుందాగా వ్యవహరించాలో కూడా తెలియదని చెబుతూ... నఖ్వీ తన చర్యతో తన దేశ పరువునూ పోగొట్టాడని మండిపడ్డ సంగతి తెలిసిందే.