స్పెషల్ ఒలంపిక్స్ లో రణ్ వీర్ సో స్పెషల్

Update: 2015-08-01 09:25 GMT
టోర్నీలు ఎన్ని ఉన్నా ఒలంపిక్స్ సో స్పెషల్ అని చెప్పక తప్పదు. ఒలంపిక్స్.. పారా ఒలంపిక్స్.. వింటర్ ఒలంపిక్స్ అంటూ చాలానే టోర్నుజరుగుతాయి. అలాంటి వాటిల్లో స్పెషల్ ఒలంపిక్స్ ఒకటి.  శారీరక ఇబ్బందులున్న ఆటగాళ్లతో నిర్వహించే ఆ ఒలంపిక్స్ లో తొలిసారి భారత్ కు చెందిన ఆటగాడు స్వర్ణం సాధించి సంచలనం సృష్టించాడు.

గుర్గావ్ కు చెందిన రణ్ వీర్ సైని ఆటిజంతో బాధ పడుతున్నాడు. రెండేళ్ల వయసు నుంచే నరాల వ్యాధిలో ఇబ్బంది పడుతున్న ఇతగాడు.. తొమ్మిదేళ్ల వయసు నుంచి గోల్ఫ్ ఆడటం మొదలు పెట్టాడు. ఇప్పటికే ఆసియా పసిఫిక్ వరల్డ్ గేమ్స్ లో రెండు స్వర్ణాలు గెలిచిన ఇతగాడు ఇప్పటికే రికార్డు సృష్టించాడు. తాజాగా.. స్పెషల్ ఒలంపిక్స్ లో భాగంగా శుక్రవారం లాస్ ఎంజిల్స్ లో జరిగిన పోటీల్లో.. తన భాగస్వామి మనికా జగూతో కలిసి స్వర్ణం సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల రణవీర్ సింగ్ భారత్ కు అపురూపమైన ఒలంపిక్ స్వర్ణాన్ని అందించాడు.
Tags:    

Similar News