అమ్మాయిల క్రికెట్లోకి.. ట్రాన్స్ ఉమెన్.. ఐసీసీ, బీసీసీఐకి అనన్య లేఖ

అయితే, టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోచ్ అయిన సంజయ్ బంగర్ కుమార్తె అనన్య బంగర్ మాత్రం అనుమతించాలని కోరుతోంది;

Update: 2025-06-17 21:30 GMT

అమ్మాయిల క్రికెట్ అంటే అమ్మాయిల క్రికెట్టే.. పురుషుల క్రికెట్ లోని వేగం, దూకుడుతో పోల్చలేం.. శరీర సామర్థ్యం రీత్యా స్త్రీ, పురుష మధ్య వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఈ మేరకు కొన్ని నిబంధనలూ మారుతుంటాయి. కాగా, మహిళలు-అమ్మాయిల క్రికెట్లోకి లింగ మార్పిడి చేయించుకున్న పురుషులు-అబ్బాయిలు ప్రవేశిస్తే.. ఇది పెద్ద విషయంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ట్రానస్ ఉమెన్ ను మహిళల క్రికెట్లోకి అనుమతించడం లేదు. అయితే, టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోచ్ అయిన సంజయ్ బంగర్ కుమార్తె అనన్య బంగర్ మాత్రం అనుమతించాలని కోరుతోంది.

అబ్బాయిగా పుట్టిన అనన్య అసలు పేరు (అబ్బాయిగా ఉన్నప్పుడు) ఆర్యన్ బంగర్. అబ్బాయిల ఏజ్ గ్రూప్ క్రికెట్ లోనూ ప్రాతినిధ్యం వహించిన ఆర్యన్ తర్వాత లింగ మార్పిడి చేయించుకుని అనన్య అయ్యాడు. ఇప్పుడు తన క్రికెట్ నైపుణ్యాన్ని మహిళల క్రికెట్ లోనూ ప్రదర్శించాలని చూస్తున్నది. కానీ, దీనికి నిబంధనలు ఒప్పుకోవడం లేదు. అందుకనే వాటిని సడలించాలని కోరుతోంది.

మహిళల క్రికెట్ లోకి ట్రాన్స్ జెండర్ ఉమెన్ కు చాన్స్ ఇవ్వాలని కోరుతూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి అనన్య లేఖ రాయడం గమనార్హం. శారీరక సామర్థ్యం పరంగా ఉన్న అపోహలను పక్కనపెట్టాలని సూచించింది. టెస్టోస్టిరాన్ స్థాయిలు, ఇతర వైద్య పరీక్షల ఆధారంగా వారి సామర్థ్యాన్ని నిర్ణయించాలని కోరింది.

మహిళల క్రికెట్లోకి ట్రాన్స్ ఉమెన్ ను అనుమతించడంపై నిపుణులు, అథ్లెట్లు, న్యాయ సలహాదారులతో కొత్త విధానాలు రూపొందించాలని సలహా ఇచ్చింది అనన్య. అథ్లెట్లందరినీ సమంగా చూడాలని, న్యాయం చేయాలని విన్నవించింది.

కాగా, ఇటీవల అనన్య తన మాజీ క్రీడా సహచరులపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవేటు పార్ట్స్ ఫొటోలు పంపాలని ఓ క్రికెటర్ కోరినట్లు ఆరోపించింది. తాను వివక్ష ఎదుర్కొన్నట్లు కూడా వాపోయింది.

Tags:    

Similar News