కాస్త చెప్పండి జగన్..గుళ్ల దగ్గర మీ వాళ్ళ ప్రచారంతో డ్యామేజ్ పక్కా!!
తెలంగాణలో పెద్దగా కనిపించదు కానీ.. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం కోసం చేసే పనులు తెలిస్తే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవాల్సిందే. మారిన కాలానికి తగ్గట్లు ప్రతి విషయాన్ని ప్రచారం చేసుకోవటం ఎక్కువైంది. గతంలో బ్యానర్లు పోయి ఫ్లెక్సీలు రావటం.. అవి చౌకగా ఉండటంతో ఆ కార్యక్రమం.. ఈ ప్రోగ్రాం అన్న తేడా లేకుండా ప్రతిదానికి భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వైనం ఎక్కువైంది.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో అయితే.. ఆడపిల్ల పుష్పవతి అయితే కూడా.. ఆ విషయాన్ని తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. అంత పిచ్చ కనిపిస్తుంటుంది. తాజాగా నడుస్తున్న కార్తీక మాసం సందర్భంగా గుంటూరు సిటీలోని దేవాలయాల దగ్గర చోటు చేసుకుంటున్న పరిణామాలపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాత గుంటూరులోని శివాలయాన్ని కార్తీకమాసం సందర్భంగా దేవుడి బొమ్ములతో అలంకరించాల్సింది పోయి.. గోడ ముందు స్థానిక ఎమ్మెల్యే.. సీఎం జగన్ బొమ్మలతో కూడిన ఫ్లెక్సీలను.. బ్యానర్లతో కప్పేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
తాము అభిమానించే నేతల ఫోటోలతో ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేయటం తప్పు కాదు. కానీ.. ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నామన్నది కూడా ముఖ్యం కదా? ఆ విషయాన్ని మర్చిపోయి.. శివాలయం ముందు మొత్తం.. అసలు అది గుడి అన్నవిషయాన్ని గుర్తించలేనట్లుగా నేతల ఫ్లెక్సీలతో నింపేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి పనులు భక్తుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు.
నేతలు.. వారి అనుచర వర్గం చేసే ఇలాంటి తీరును తప్పు పట్టి.. అధ్యాత్మిక కేంద్రాల వద్ద ఇలాంటివి వద్దని సీఎం జగన్ చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. రాజకీయ పార్టీలు.. నేతలు ప్రచారాన్నికోరుకుంటారు. దాన్ని తప్పు పట్టటం లేదు కానీ.. దానికి పరిమితులు ఉంటాయన్నది మర్చిపోకూడదు. ఇలాంటి విషయాలపై అధినేత కల్పించుకొని అందరికి అర్థమయ్యేలా ప్రకటన జారీ చేస్తే బాగుంటుందన్న సూచన పలువురి నుంచి వస్తోంది.