ఏపీలో మళ్లీ రంగుల పంచాయితీ?
ప్రభుత్వ కార్యాలయాల రంగులు మార్చాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటమే కాదు.. స్థానిక ఎన్నికలకు పెట్టిన లింకు సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఆ మధ్యన రంగులు వేయటం.. ఆ రంగులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగులుగా ప్రతిపక్షాలు విమర్శలు చేయటం తెలిసిందే. ఈ అంశంపై కోర్టుకు వెళ్లటం.. ఈ వివాదంపై విచారించిన హైకోర్టు.. మూడు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాల రంగులు మార్చేయాలని.. ఆ తర్వాతే స్థానిక ఎన్నికల గురించి ఆలోచించాలన్న మాటను చెప్పేసింది.
స్థానిక ఎన్నికలకు ముందే ప్రభుత్వ కార్యాలయాల రంగులు మార్చాలన్న టార్గెట్ పెట్టేశారు. దీంతో.. ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త రంగులు వేసే పని షురూ అయ్యింది. ఇందులో భాగంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయటం షురూ చేశారు. తాజాగా వేస్తున్న రంగుల్లోనూ అధికారపక్షం అన్యాయంగా వ్యవహరిస్తోందన్న విమర్శను తెర మీదకు తీసుకొచ్చారు.
తాజాగా ప్రభుత్వ కార్యాలయాలకు వేస్తున్న రంగులపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రస్తుతం గ్రీన్.. బ్లూ.. వైట్ తో పాటు కాషాయ రంగును వేస్తున్నట్లుగా ఆరోపించారు గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్. తాను ఉత్తినే విమర్శలు చేయటం లేదంటూ.. తాను చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యంగా వీడియోను పోస్టు చేశారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని హనుమాన్ పాలెంలోని పంచాయితీ ఆఫీసుకు కొత్త రంగులు వేస్తున్నారని.. అందులో కాషాయ రంగు మినహా మిగిలిన రంగులన్ని గతంలో వాడినవేనని ఆరోపిస్తున్నారు. ఈ మాత్రం దానికే రంగులు మారుస్తున్నట్లుగా చెప్పటం తప్పంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నేత విమర్శల్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. తెలుపు క్షీర విప్తవానికి ప్రతీకగా.. నీలం..చేపల పెంపకానికి.. ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. అయితే.. ఇవే రంగులు ఏపీ అధికారపక్ష జెండాకు ఉన్నాయని తప్పు పడుతున్నారు. మరీ కొత్త పంచాయితీ పై ఏపీ హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి?