నిజంః జగన్ కేంద్రంపై మండిపడ్డాడు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న స్కాలర్ రోహిత్ ఉదంతం ఆధారంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. హెచ్ సీయూకు వెళ్లిన జగన్ అక్కడి విద్యార్థులతో సమావేశమై రోహిత్ ఆత్మహత్య పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిచ్చుకపై బ్రహాస్త్రంలాగా యూనివర్సిటీ విద్యార్థుల అంశం గురించి కేంద్ర మంత్రి లేఖ రాయడం ఏంటని జగన్ ప్రశ్నించారు. మరో కేంద్ర మంత్రి అందుకు వకాల్తా పుచ్చుకోవడం, పదే పదే నిర్ణయం కోసం ఒత్తిడి చేయడం బాధాకరమన్నారు. రోహిత్ మృతికి కారణమైన వీసీతో పాటు పరోక్షంగా కారణమైన కేంద్రమంత్రులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
యూనివర్సిటీలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ఇలాంటివి చూస్తుంటే మానవత్వం మాయమైపోతోందనే భావన కలుగుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ ఎస్సీ కాదు బీసీ అనే విషయం ఎందుకు తెరమీదకు తెస్తున్నారని ప్రశ్నించారు. సస్పెన్షన్ విధించిన విద్యార్థులపై ఆ నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు. తమ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని జగన్ ప్రకటించారు. పార్లమెంటులో ఈ విషయాన్ని తమ ఎంపీలు ప్రస్తావిస్తారని జగన్ వారికి హామీ ఇచ్చారు.
ఇదిలాఉండగా హెచ్ సీయూకు వెళ్లడానికి ముందు రోహిత్ కుటుంబ సభ్యులతో జగన్ ఫోన్ లో మాట్లాడారు. రోహిత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని, అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు.