• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నాడు వైఎస్.. నేడు జగన్.....

నాడు వైఎస్.. నేడు జగన్.. అదే తీరు..

By - Tupaki Desk
Update: 2019-07-15 11:41 GMT
ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టగానే జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలకు వేదిక అవుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి.. వాటిని అమల్లోకి తీసుకొచ్చి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. అయితే  ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్న మావోయిస్టులపై జగన్ డేరింగ్ స్టెప్ వేశారు.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా మావోయిస్టులను చర్చల పేరుతో ఆహ్వానించి ఒక గొప్ప స్నేహహస్తాన్ని చాటారు. ఇప్పుడు వైఎస్ కూడా తండ్రి బాటలోనే మావోయిస్టులపై కేబినెట్ సబ్ కమిటీ వేయడం విశేషం.

చంద్రబాబు ప్రభుత్వం చివరి ఏడాదిలో మావోయిస్టులు అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిడారి సోము,ఆయన అనుచరుడిని హత్యచేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.  మైనింగ్ మాఫియాను పెంచి పోషించినందుకే ఈ హత్య జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తాజాగా మావోయిస్టుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారి సమస్యలపై ఏపీ ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ కమిటీ పలు అంశాలపై చర్చించి నిర్నయాలు తీసుకోనుంది. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతోపాటు మావోల దాడుల్లో దెబ్బతిన్న ఆస్తులను పునర్మిర్మించడం తదితర విషయాలపై కమిటీ చర్చించనుంది.

ఏపీ ప్రభుత్వం సోమవారం ఈ మేరకు మావోయిస్టుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టుల నియంత్రణ, వారి సమస్యలపై ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుందని తెలిపింది. ఈ కమిటీకి చైర్మన్ గా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటారు. కమిటీలో సభ్యులుగా హోంమంత్రి- గిరిజన- రెవెన్యూ- ఆర్ అండ్ బీ మంత్రులకు చోటు కల్పించారు.
    
    

Tags:    
  • Ys Jagan 
  • Maoist 
  • Telugu News 
  • Latest News 

Similar News

'అధ్య‌క్ష ప‌ద‌వే' యువ‌త‌కు ఇచ్చేయండి .. సాయిరెడ్డి పై మీమ్స్‌.. !

2026-11-12 14:30 GMT

మంగళగిరి-తాడేపల్లి సమరం: నారా లోకేశ్‌కు అసలైన పరీక్ష.. వైసీపీకి జీవన్మరణ పోరాటం!

2026-11-12 13:56 GMT

కేజ్రీవాల్ కే గురిపెట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. రూ.7 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం..

2026-11-12 13:50 GMT

'మ‌న్యం'లో జ‌న‌సేనకు మైన‌స్‌లు ఇవే.. !

2026-11-12 13:30 GMT

చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !

2026-11-12 12:30 GMT

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

Copyright @2026

Powered by Blink CMS