ఆ వైసీపీ నేతలపై అధిష్టానం ఆగ్రహం
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం అంటేనే టీడీపీకి పెట్టని కోట.. అందులో ఇచ్చాపురం అంటే టీడీపీదేనంటారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక్కసారి మినహా టీడీపీ అభ్యర్థులు ఇక్కడ ఓడిపోలేదు.2019లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచినా.. ఇక్కడ మాత్రం సైకిల్ జోరుకు వైసీపీ నేతలు బ్రేకులు వేయలేకపోయారు.
అయితే ఇప్పటికీ ఇచ్చాపురంలో నలుగురు వైసీపీ నేతల వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏడాది గడిచినా అక్కడి నేతల ఆధిపత్య పోరు తగ్గడం లేదట.. ఇచ్చాపురం వైసీపీ ఇన్ చార్జి సాయిరాజ్ కు జగన్ సర్కార్ డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఇచ్చింది.అయినా ఆయన నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోయారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని నేతలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్ ఆమె భర్త ఇప్పుడు సాయిరాజ్ వ్యతిరేక వర్గంగా మారిపోయారట..
ఇక ఇచ్చాపురం వైసీపీ ఇన్ చార్జిని అధిష్టానం అధికారికంగా ఖరారు చేయలేదు. దీంతో ఇన్ చార్జి పదవి కోసం ఇచ్చాపురం నేతలు పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని చుట్టూ తిరుగుతున్నారు.
ఏకంగా సాయిరాజ్ తోపాటు లల్లు, రామారావు, నరేంద్ర, సంతూ లు ఇచ్చాపురం ఇన్ చార్జి రేసులో హోరాహోరీగా రాజకీయం చేస్తున్నారు. ఎవరికీ వారే ఫైరవీలు చేస్తున్నారు. ఇలా ఓడిపోయిన పార్టీని బలంగా మార్చేందుకు చూడకుండా ఆధిపత్యం వైసీపీ నలుగురు నేతలు కొట్టుకుంటున్న వైనం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.