మద్యం మత్తులో పాముని తినేసిన యువకులు.. ఆ తర్వాత ఏమైందంటే
పాములు మనుషులను కరవడం కామన్. కానీ, పాములు తరచూ తమ ప్రాంతంలోకి వచ్చి కాటేస్తున్నాయని, ఇద్దరు యువకులు సగం కాలిన పాముపై తమ ప్రతీకారం తీర్చుకున్నారు. మద్యం మత్తులో ఇద్దరూ కలిసి సగం కాలిన విషపూరిత పామును తిన్నారు. అనంతరం వారిద్దరూ అస్వస్తతతకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ షాకింగ్ సంఘటన ఛత్తీస్ గఢ్ లోని కోర్బా ఇందిరా నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఇద్దరు యువకులు సగం కాలిన విషపూరిత పామును తిని స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారి పరిస్థితి విషమించడంతో స్థానికులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వారు కోలుకున్న ఆ తర్వాత కుటుంబసభ్యులు, వైద్యులు వారిని ప్రశ్నించగా, మద్యం మత్తులో సగం కాలిన పామును తిన్నామంటూ చెప్పడంతో వారంతా షాక్ కు గురయ్యారు. తమ ప్రాంతంలో తరచుగా చాలామంది పాము కాటుకు గురవుతున్నారని, దీంతో మద్యం మత్తులో ప్రతీకారం తీర్చుకునేందుకు కోపంతో పామును తిన్నట్లు యువకులు వెల్లడించారు.
ఈ వింత సంఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరానగర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ పాము కనిపించగా.. స్థానికులు దానిని చంపి కాలువ దగ్గర కాల్చారు. అయితే.. అది సగం మాత్రమే కాలిపోయింది. స్థానికులైన రాజు జంగ్డే, హితేంద్ర ఆనంద్ మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నారు. కాలువ దగ్గర సగం కాలిన పామును చూసి, వారిద్దరూ కోపంతో ఒకరి తర్వాత ఒకరు తినడం ప్రారంభించారు. పామును తిన్న తర్వాత ఇద్దరికీ వాంతులు మొదలయ్యాయి.
అనంతరం స్పృహ కోల్పోయిన వారిద్దరినీ., కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మద్యం మత్తులో తాము ఇలా చేసినట్లు రాజు, హితేంద్ర వైద్యులకు తెలిపారు. కొన్ని రోజులుగా పాములు తమ ప్రాంతంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని.. అందుకే కోపంతో పామును తిన్నట్లు వెల్లడించారు. కాగా యువకులు తిన్న పాము బెలియా క్రైట్ జాతికి చెందినదని.. ఇది కాటేస్తే 15 నిమిషాల్లో చనిపోవడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు.