పెటర్నటీ లీవ్ తీసుకున్న ఎంపీకి పాప పుట్టింది
తన భార్య గర్భవతి అని.. వారంతో డెలివరీ కానుందని.. ఈ సమయంలో భార్యకు తోడుగా ఉండాల్సిన బాధ్యత భర్తగా తన మీద ఉందని.. తనకు పితృత్వ సెలవులు కావాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన వైనం అందరిని ఆకర్షించటమే కాదు..టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అందరి అభినందనల్ని సొంతం చేసుకున్నారు. కీలకమైన బడ్జెట్ సమావేశాల్ని మిస్ అవుతున్న విషయాన్ని చెబుతూనే.. పెటర్నిటీ లీవ్ కోసం అప్లై చేసిన వైనం ఎందరికో కొత్త స్ఫూర్తిని ఇచ్చినట్లైంది.
జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు తనకు తొమ్మిది రోజులు సెలువులు ఇవ్వాలని కోరిన ఎంపీ రామ్మోమన్ నాయుడు.. ఆయన ఊహించినట్లే జరిగింది. పాప పుట్టినట్లుగా ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. క్యూట్ బీబీ గర్ల్ పుట్టిందని.. భార్య.. పాప ఇద్దరూ బాగున్నట్లుగా పేర్కొన్నారు. సండే వేళ.. శుభవార్త చెప్పిన రామ్మోహన్ నాయుడికి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.
2017 జూన్ లో మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి కుమార్తె శ్రావ్యను రామ్మోహన్ నాయుడు పెళ్లాడారు. వారికి పాప పుట్టిన విషయం తెలిసినంతనే.. ఆయన అభిమానులతో పాటు.. పలువురు ప్రముఖులు ఆయన్ను అభినందిస్తూ ట్వీట్ చేవారు. తండ్రి కావటం జీవితంలో అత్యంత ఆనందకర సందర్బంగా టీడీపీ నేత నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ యువ ఎంపీకి పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు. తండ్రి అయిన రామ్మోహన్నాయుడికి మనం కూడా శుభాకాంక్షలు చెబుదాం.