• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యోగి బాబాయ్ అసలుసిసలు...

యోగి బాబాయ్ అసలుసిసలు ఎన్నికల కత్తి బయటకు తీశాడుగా

By - Tupaki Desk
Update: 2022-01-29 05:30 GMT
కాషాయం కట్టుకున్న యోగులు రాజకీయం చేయటమా? అంటూ ఫైర్ అయ్యే వారి మాటల్ని అస్సలు పట్టించుకోకుండా.. తాను చేయాల్సిన రాజకీయాల్ని చేసుకుంటూ పోవటం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. హిందుత్వ కార్డుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి.. మతం గురించి కంటే కూడా డెవలప్ మెంట్ గురించి.. తమ రాష్ట్రంలో తన ఐదేళ్ల పాలనలో ఎంతలా బాగు పడిందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయరన్న సంగతి తెలిసిందేఅయినా యోగి మాష్టారి నుంచి జనాల బతుకులు.. మెరుగుపడిన మౌలిక వసతులు.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం.. పిల్లల విద్య మీద కంటే.. హిందుత్వ అంశాన్ని ఎప్పుడు ఎంతల తెలివిగా వాడాలన్న దానిపైనే ఆయన ఎక్కువ ఫోకస్ పెడతారన్న విషయం తెలిసిందే. దేశంలోనే అత్యంత పెద్దదైన రాష్ట్రానికి విజయవంతంగా రెండోసారి ముఖ్యమంత్రి కావాలని డిసైడ్ అయిన యోగి.. తన శాయుశక్తుల్ని వినియోగించి.. మరోసారి పవర్ లోకి రావాలన్న గట్టి ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. తమ అంచనాలకు మించి సమాజ్ వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ దూసుకెళుతూ.. ప్రజల మనసుల్ని గెలుచుకునే మాటల్ని మాట్లాడుతుంటే.. యోగి బాబాయ్ ఊరుకుంటారా చెప్పండి.

అందుకే తాజాగా యోగి మాష్టారి లోని అసలుసిసలు నేతాశ్రీ నిద్ర లేచారని చెప్పాలి. ఎన్నికల పోలింగ్ దగ్గరవుతున్న కొద్దీ.. ఆయన మాటలు తూటాల మాదిరి పేలుతున్నాయి. తాజాగా యోగి మాష్టారు..మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. ఇటీవల అఖిలేశ్.. మహ్మద్ అలీ జిన్నాను  స్వాతంత్య్ర వీరుడిగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మీద ఆయన ఘాటు విమర్శలు చేశారు.

వారు జిన్నాను ఆరాధిస్తే.. మేం సర్దార్ పటేల్ ను ఆరాధిస్తామన్నారు. పాకిస్థాన్ వారికి ప్రీతికరమైనదన్న యోగి.. భారత మాత కోసం తమ జీవితాల్ని త్యాగం చేస్తామంటూ యోగి ట్వీట్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధికకారంలో ఉన్నప్పుడు రామ భక్తుల మీద కాల్పులు జరిగాయని.. కన్వార్ యాత్రలు రద్దు అయిన వైనాన్ని గుర్తు చేశారు.

అంతేకాదు.. అఖిలేశ్ ప్రభుత్వంలో హిందువులకు ఎదురైన కష్టాలను.. తమ ప్రభుత్వంలో వారికి వేసిన పెద్ద పీట గురించి ఉదాహరణలో చెప్పిన తీరు చూస్తే.. ఎన్నికల సమయంలో ఓట్లు రాల్చే కత్తిని యోగి బాబాయ్ బయటకు తీసి.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని చెప్పక తప్పదు. మరి.. యోగి మాటలకు యూపీ ఓటర్లు ఏ రీతిలో రియాక్టు అవుతారో ఎన్నికల ఫలితాల వేళనే తెలుస్తుందని చెప్పక తప్పదు.
Tags:    
  • uttarpradesh 
  • cm 
  • yojibaba 
  • electionmoment 
  • politicalnews 
  • tupakiupdates 

Similar News

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS