కేదార్ నాథ్ మంచులో చిక్కుకున్న ఇద్దరు సీఎంలు..

Update: 2020-11-17 06:45 GMT
హిందువులు పరమ పవిత్రంగా భావించే ‘కేదార్ నాథ్’ ఆలయ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఎండాకాలం మే నుంచి ప్రారంభమై నవంబర్ నెల వరకు మాత్రమే ఈ కేదార్ నాథ్ ఆలయం భక్తుల సందర్శనార్థం కనిపిస్తుంది. ఆ తర్వాత మంచులో కూరుకుపోతుంది. అందుకే ఈ ఐదారు నెలలు భక్తులు పోటెత్తుతారు.

తాజాగా కేదార్ నాథ్ ఆలయ ముగింపు వేడుకకు హాజరైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ సీఎంలు త్రివేంద్రసింగ్ రావత్, యోగి ఆధిత్యనాథ్ లు భారీగా కురుస్తున్న మంచుకు అక్కడే ఇరుక్కుపోయారు.

హెలిక్యాప్టర్ ద్వారా ప్రయాణించే పరిస్థితులు లేకపోవడం.. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సీఎంలు ఇద్దరూ కేదార్ నాథ్ లో చిక్కుకుపోయారని ఉత్తరాఖండ్ డీజీ అశోక్ కుమార్ తెలిపారు.

అయితే సాయంత్రం 5.30 గంటల సమయంలో రావత్, ఆధిత్యనాథ్ ఇద్దరూ అతికష్టం మీద వాహనాల ద్వారా గౌచార్ కు క్షేమంగా చేరుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టైంది.

కేదార్ నాథ్ లో జరుగుతున్న నిర్మాణ పనులను, ముగింపు వేడుకలను పరిశీలించడానికి ఇద్దరు సీఎంలు వెళ్లారు. వీరి వెంట నేతలు వచ్చారు. అయితే భారీగా మంచు కురుస్తుండడంతో ముందుకు సాగలేక అక్కడే చిక్కుకుపోయారు. తాజాగా వారు అక్కడి నుంచి బయటపడి గౌచార్ కు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Tags:    

Similar News